BRO: పవన్ కళ్యాణ్ మూడో భార్యతో విడాకులపై స్ట్రాంగ్ కౌంటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తూనే ఉంటాం. అయితే పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కావడం మూలాన ఆయనని ప్రత్యర్ధులు ఎదో ఒక పాయింట్ తో టార్గెట్ చేస్తూ ఆయన గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. అలాగే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గురించి మరోసారి తన మూడవ భార్య అయిన అనా కొణిదెలకు విడాకులు ఇవ్వబోతున్నట్టు రూమర్ స్ప్రెడ్ చేసి, దాన్ని వైరల్ చేసారు ఈ బ్యాచ్.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ పై వచ్చిన ఈ రూమర్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవలనే తన ప్రమోషన్స్ ల దృష్ట్యా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతితక్కువ సమయంలోనే 1 మిలియన్ ఫాలోయర్స్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ మరో పక్క తన రాజకీయ వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసాడు.

అయితే ఈ యాత్ర మొదటి దశ సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో అయన సతీసమేతంగా హైదరాబాద్ లోని తన స్వగృహంలో అనా కొణిదెలతో కలిసి పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పక్కన అనా కొణిదెల చక్కగా పట్టుచీర కట్టుకొని సంతోషంగా నవ్వుతూ, చూడ ముచ్చటగా ఉంది వీరిద్దరి జంట. ఇక వీరిద్దరూ కలిసి పూజ చేస్తుండగా తీసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ అనా కొణిదెల అంత సంతోషంగా ఉంటె వారిద్దరూ విడాకులు అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేసిన బ్యాచ్ కు చెంప చెల్లుమన్నట్టయింది.

- Advertisement -

ప్రస్తుతం పవన్, వారాహి యాత్ర నుంచి బ్రేక్ తీసుకొని, తన సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఆయన నటించిన బ్రో సినిమా ఈ నెల 28 న రిలీజ్ కు ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ, మరో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ , ఒజి సినిమాల షూటింగ్ లకు షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు