Hi Nanna : అటు ‘డుంకి’.. ఇటు ‘సలార్’.. అయినా నాని తగ్గట్లేదుగా..!

‘హాయ్ నాన్న’.. నేచురల్ స్టార్ నాని నటించిన ఒక ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ డ్రామా. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని హీరోగా నటించగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డే నే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అన్ సీజన్లో రిలీజ్ అవడం వల్ల అంతగా ఓపెనింగ్స్ రాలేదు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ ప్రభావం వల్ల హాయ్ నాన్న వీకెండ్ లో మంచి వసూళ్లు అందుకుంది.

ఇక హాయ్ నాన్న వచ్చిన రెండు వారాల తర్వాత పాన్ ఇండియా సినిమా సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవడంతో హాయ్ నాన్న కలెక్షన్లకు ఎండ్ కార్డు పడిందని అనుకున్నారు నెటిజన్లు. కానీ హైదరాబాద్ వంటి సిటీ ఏరియాల్లో లిమిటెడ్ థియేటర్లలో రన్ అవుతున్న హాయ్ నాన్న వీకెండ్ లో మాత్రం తన జోరు చూపిస్తుంది. అటు ఓవర్సీస్ లో కూడా షారుఖ్ ఖాన్ డుంకి హవా చూపిస్తున్నా, కొన్ని థియేటర్లలో నాని సినిమా చూడ్డానికే ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక నిన్న ఆదివారం వీకెండ్ కావడంతో సలార్, డుంకి వసూళ్లతో రెచ్చిపోగా, అక్కడికి నేనేం తక్కువా అన్నట్టు హాయ్ నాన్న లిమిటెడ్ షోస్ తో అయినా క్రేజీ వసూళ్లతో దుమ్ములేపాడు. ఇక 18వ ఆదివారం వీకెండ్ లో హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో 47 లక్షల వరకు షేర్ సాధించగా, ఓవర్సీస్ సహా వరల్డ్ వైడ్ గా 65 లక్షలకు పైగా షేర్, 1.30 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. ఇక హాయ్ నాన్న 35.25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికే 6.75 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచిన హాయ్ నాన్న క్రిస్మస్ హాలిడే లో మరింత జోరు చూపించే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు