గురూజీ అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం సినిమాతో మాటల రచయిత తెలుగు తెరకు పరిచయమైన త్రివిక్రమ్. అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో ఒక చెరగని ముద్రను వేసారు. తెలుగు సినిమా సంబాషణలను కొత్త పుంతలు తొక్కించాడు. రచయితగా కెరియర్ పీక్ లో ఉన్న టైం లో “నువ్వే నువ్వే” సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక కూడా వెంకటేష్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ […]
జానీ సినిమా తర్వాత పదేళ్లు హిట్ లేదు అయినా ఇమేజ్ చెక్కు చెదరలేదు, రెండేళ్లకు ఒక సినిమా అయినా ఓపెనింగ్స్ కు డోకా లేదు, ఆయన సినిమా వస్తే చాలు దానికి హిట్టు ప్లాప్ తో సంబంధం లేదు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే. కానీ అభిమానులకి మాత్రం ఎక్కడో చిన్న అసంతృప్తి సరైన సినిమా పడట్లేదు కళ్యాణ్ కి అని. ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతీసారి ఎన్నో ఆశలతో సినిమాకి […]
అది వరంగల్ జిల్లా చల్లగరిగె అనే చిన్న గ్రామం. ఆ ఊర్లో ఒక గ్రంథాలయం , ఒక శివాలయం వాటికి కొంచెం చేరువలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ అనే అబ్బాయికి తెల్లవారుజామున శివాలయంలో వినిపించే పాటలు కంఠస్థం, హృదయస్తం అయిపోయాయి. పొద్దున్న పాటలు, సాయంత్రం గ్రంథాలయంలోని పుస్తకాలు, వీటి మధ్య పెరిగాడు ఆ అబ్బాయి. సినిమా మీద మక్కువతో సినిమాల్లో పాటలు పాడాలని ఎన్నో పాట్లు పడ్డాడు, ఫలితం లేదు. పుస్తకాలు […]
ప్రతి కథకు ఒక ప్రారంభం కావాలి. ఆ ప్రారంభానికి ఒక ప్రేరణ కావాలి. మహానటి సినిమాను తెరకెక్కించడానికి కూడా ఒక ప్రేరణ ఉంది. తెలుగు రచయితలను, సినిమా ప్రముఖులను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయం చేసే కిరణ్ ప్రభా గురించి సాహితీ ప్రియులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎందరో సినీ ప్రముఖులను పరిచయం చేసినట్లే దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం “మహానటి” సావిత్రి గారి గురించి కూడా “కిరణ్ ప్రభా” పరిచయం చేసారు. […]
పాన్ ఇండియా సార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. పుష్ప సినిమా రికార్డుల గురించి కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై […]
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. పుష్ప సినిమా రికార్డుల గురించి కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సుకుమార్. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్, యాటిట్యూడ్ […]
సుకుమార్.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయ్యాల్సిన అవసరం లేదు. తన మొదటి సినిమా ఆర్య తోనే అదిరిపోయే హిట్ అందుకుని ఒక సరికొత్త ఫిలిం మేకర్ ఇండస్ట్రీకి దక్కాడు అనిపించుకున్నాడు. ఒక ప్రేమకథను ఇలా కూడా చెప్పొచ్చు. ఒక అందమైన కావ్యంలా వెండితెరపై ఆవిష్కరించొచ్చు అని నిరూపించాడు సుకుమార్. “ఆర్య” సినిమా నుంచి “నాన్నకు ప్రేమతో..” సినిమా వరకు వచ్చిన ప్రతి సినిమా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ రామ్ చరణ్ ను […]
శ్రీకాంత్ ఓదెల ఈ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. కేవలం ఒక్క దసరా సినిమాతో తెలుగు సినిమాలో హాట్ టాపిక్ అయ్యాడు శ్రీకాంత్. శ్రీకాంత్ తెరకెక్కించింది మాములు కథ అయినా, శ్రీకాంత్ ఆ సినిమాను తెరకెక్కించిన విధానం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాను ఇంత అద్భుతంగా ఎలా తెరకెక్కించించాడు అనే ఆలోచనను రేకెత్తించాడు శ్రీకాంత్. శ్రీకాంత్ ఈ సినిమాను రాగా, రస్టిక్ గా తెరకెక్కించాడు. దసరా సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బాక్గ్రౌండ్ స్కోర్ […]
సినిమా అంటే కొందరికి వ్యాపారం, ఇంకొందరికి వ్యాపకం, కానీ కొంతమందికి జీవితం. ఎంత చదువుకున్న ఇండస్ట్రీలో ఏదో సాధించాలి అనే కసి తపనతో కొంతమంది ఉంటారు. అందులో హరీష్ శంకర్ ఒకడు రచయిత గా కెరియర్ మొదలు పెట్టి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన హరీష్ శంకర్ నేడు టాప్ డైరెక్టర్స్ లో ఒకడు. ఎన్నో సంవత్సరాల నీరీక్షణ తరువాత దర్శకుడుగా హరీష్ కి అవకాశం వచ్చింది. దర్శకుడుగా మొదటి సినిమా “షాక్” ఇచ్చింది. రెండో […]
కాలం మారుతున్న కొద్దీ కొన్నిటిలో మార్పు వస్తుంది అంటారు అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఒకప్పుడు ఏ హీరో అభిమానులైన థియేటర్ దగ్గర ఆర్గుమెంట్స్ లేదంటే పెద్ద పెద్ద బ్యానర్స్ కడుతూ వాళ్ళ అభిమానాన్ని చాటుకునేవారు. ఒక సినిమా ఎన్ని రోజులు ఆడింది ఎన్ని సెంటర్లు ఆడింది అనేది ఒకప్పుడు రికార్డుగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఒక సినిమా ఎంత కలెక్ట్ చేసింది యూట్యూబ్లో ట్రైలర్ పెట్టగానే ఇన్ని వ్యూస్ సంపాదించింది టీజర్ […]