Adipurush: కృతి సనన్‌కి సీతాశాపం తప్పదా ? ఈ స్టార్ కెరీర్ ఇక ముగిసినట్టేనా ?

ప్రేక్షకులు మెచ్చే పాత్రలు రావడం అంత సులువేమీ కాదు. అలాంటి పాత్రలు వస్తే హీరో, హీరోయిన్ల కెరీర్ ఒక్క సారిగా మారిపోతుంది. అయితే ప్రేక్షకులు మెచ్చే పాత్రల విషయంలో ముందుగా ఉండేది రామాయణంలో సీత పాత్ర. చలన చిత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఈ పాత్ర చేసిన హీరోయిన్ల కెరీర్ ఒక రేంజ్ లో వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ పాత్ర బాలీవుడ్ స్టార్ కృతి సనన్ ను వరించింది.  కృతిసనన్ తన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “ఆదిపురుష్” యొక్క ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా ఉంది. ఈ సినిమా రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో మూవీపై ఇండస్ట్రీ లో ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీతగా నటించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ పాత్రే కృతి సనన్ కి ఒక రకంగా కష్టాలు తెచ్చిపెడుతుంది. భారతదేశంలో రాముడిని గాని, సీతమ్మని గాని ప్రజలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు వారిని దేవుళ్లుగా పూజిస్తారు. అలాంటిది ఆ పాత్రలు సినిమాల్లో వేసే వాళ్ళు కూడా అంతే పవిత్రంగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అయితే ఇలాంటి పాత్రలు వేస్తే ఆ స్టార్స్ ని ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. ఉదాహరణకి తెలుగులో రాముడిగా నటించిన సీనియర్ ఎన్టీఆర్ ని అప్పట్లో చాలా మంది రాముడి స్వరూపంగానే భావించి మర్యాద ఇచ్చేవారు. పలు చిత్రాల్లో శివుడి పాత్ర వేసిన చిరంజీవిని ఇప్పటి కూడా అయన అభిమానులు శివుడిలానే చూస్తారు. ఆయా హీరోలు కూడా ఇలాంటి పాత్రలు వేసినపుడు చాలా పవిత్రంగా పద్ధతిగా ఉంటారు.

వీళ్ళే కాదు అలనాటి నటులు సీత పాత్ర వేసిన అంజలి దేవి, సంగీత, చంద్రకళ మొన్నటికి మొన్న “శ్రీరామరాజ్యం” లో సీతగా నటించిన నయనతార తో సహా అందరూ సినిమాలోనే కాకుండా బయట కూడా చాలా సంప్రదాయబద్ధంగా ఉంన్నారు.. ఉంటున్నారు. అయితే ఈ జెనరేషన్ హీరోయిన్లు అప్పటి వాళ్ళలా ఉండడం కష్టమే కావచ్చు. కానీ బయట సోసిటీ లోకి వచ్చినపుడు అయినా కొంచెం పద్ధతిగా నిండైన వస్త్రాలతో ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ “ఆదిపురుష్” విషయంలో కృతి సనన్ చేసిన తప్పు అదే.

- Advertisement -

కృతి సనన్ ఒక స్టార్ హీరోయిన్ అయినా సరే, సీత లాంటి పాత్ర వేసినపుడు సమాజంలో కూడా ఎంతో అణకువతో పద్ధతిగా ఉండాలి. నయనతార లాంటి హీరోయిన్లకే ఇది తప్పలేదు. శ్రీ రామరాజ్యం తర్వాత బోల్డ్ మూవీస్ కి పూర్తిగా దూరంగా ఉన్న నయన్.. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. అయితే ఇటీవల “సీతారామం” చిత్రంలో సీత పాత్ర చేసిన మృణాల్ ఠాకూర్ కు మాత్రం అది జరగలేదు. ముందుగా సీత అన్న పేరు ఉన్నందుకే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. కానీ, తర్వాత మృణాల్ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలతో చేసిన రచ్చ చూసి అదే ఆడియన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. సీత అయివుండి అలాంటి బట్టలు ధరించడం ఏంటి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మృణాల్ ఠాకూర్ ఇప్పటికీ చాలా కష్టపడుతుంది.

అలాంటిది ఇప్పుడు సీత పాత్ర చేసిన కృతి సనన్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కృతి ఇవేమి పట్టనట్టు బయట సోసైటీలో విచ్చల విడిగా పొట్టి పొట్టి డ్రెస్సులతో తిరుగుతూ ఉంది. అంతే కాదు రీసెంట్ గా నటించిన సినిమాల్లో ఎక్స్ పోసింగ్ సీన్లలో నటించడంతో ఆడియన్స్ అప్పుడే కృతిపై పెదవి విరుస్తున్నారు. ఈ కాలంలో సీత, సావిత్రి లాంటి పాత్రలున్న సినిమాలు రావడమే తక్కువ. అలాంటిది కృతి సనన్ కి సీత పాత్ర అదృష్టం కొద్దీ దొరికింది. మళ్ళీ ఇంత మంచి పాత్రలు కూడా కృతి కి ఇకముందు దొరకవు. ఈ విషయం కృతి సనన్ గమనించి తన రాబోయే సినిమాల పాత్రల విషయంలో కేరింగ్ గా ఉండాలి. మరి తన అప్ కింగ్ మూవీస్ సెలక్షన్ లో ఈ సందిగ్ధత ను ఎలా జయిస్తుందో తెలియదు గాని, ఆ సెలెక్షన్ల వల్లే తన కెరీర్ నిలబడుతుందా? లేక ఎండ్ అవుతుందా? అన్నది డిసైడ్ అవుతుంది.  కనీసం ఆదిపురుష్ సినిమా విడుదలయ్యే వరకైనా ఈ హీరోయిన్ ఇలా బయట తిరగడం ఆపకపోతే ఈ కృతి కెరీర్ ఇక్కడితో ముగిసిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో పలు బ్రాండ్స్ కి సంబంధించిన యాడ్స్ లో ఎక్స్ పోసింగ్ చేస్తూ ప్రేక్షకుల ట్రోలింగ్ కు గురైన కృతి సనన్, ఇప్పటికైనా మారకపోతే తనకి ఆదిపురుష్ తర్వాత సినిమా ఛాన్సులు ఉండవనే చెప్పాలి. మరి కృతి సనన్ తప్పు తెలుసుకుని ఇండస్ట్రీ లో నిలబడుతుందా? లేక తన కెరీర్ తనే స్పాయిల్ చేసుకుని సినీ కెరీర్ కి ముగింపు పలుకుతుందా అన్నది చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు