BRO: ఆదిపురుష్ ఎఫెక్ట్ – తగ్గక తప్పదా ‘బ్రో’..!

ఒక సినిమా హిట్ అయితే, అదే ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చే నెక్స్ట్ సినిమాకి కూడా బిజినెస్ బాగా జరిగే అవకాశం ఉంది. అదే రకంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే, ఆ నిర్మాత నుండి వచ్చే నెక్స్ట్ సినిమాపై ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం పీపుల్స్ మీడియా పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి. ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తెలుగు వర్షన్ రైట్స్ ని 185కోట్ల భారీ రేట్ కి పీపుల్స్ మీడియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ 340కోట్ల మేర గ్రాస్ సాధించిన ఆదిపురుష్, వీక్ డేస్ లో చతికిలబడింది. 4, 5వ రోజున వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఆదిపురుష్ బ్రేకివెన్ అవుతుందా లేదా అన్న సందేహం కలుగుతోంది.

ఈ క్రమంలో, పీపుల్స్ మీడియా నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా బ్రో పై ఈ డిజాస్టర్ తాలూకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఆదిపురుష్ ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ బ్రో సినిమా రైట్స్ ని తగ్గించమని డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని బేస్ చేసుకొని బ్రో సినిమాను ఫ్యాన్సీ రేట్స్ కి అమ్మే ఛాన్స్ ఉండదు. అసలే రీమేక్ సినిమాకి టికెట్ రేట్స్ పెంచే అవకాశం లేకపోవటం, ఏపీలో రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రతికూలంగా ఉండటం వంటి పరిణామాలు చూస్తే, బ్రో సినిమా దెన్జర్ జోన్ లో పడే ప్రమాదం ఉందని అనిపిస్తోంది.

జులై 28న విడుదలకి ప్లాన్ చేసిన ఈ సినిమాలో తేజ్ షూటింగ్ ఇంకా కొంత భాగం పెండింగ్ ఉండటంతో శరవేగంగా షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, తేజ్ తొలిసారి కలిసి నటించిన సినిమా కావటంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియెన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ ద్వారా ఫెయిల్యూర్ ని మూట కట్టుకున్న పీపుల్స్ మీడియా బ్రో ద్వారా అయినా హిట్ అందుకొని ట్రాక్ లో పడుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు