Agent: పాపం అఖిల్ రెండేళ్ల శ్రమ వృథా.. రెమ్యూనరేషన్ రీటర్న్ ?

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ గతనెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతడి మార్క్ కనపడకపోవడం, ఇల్లాజికల్ యాక్షన్ సీన్లు లాంటి కారణాల వల్ల ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. దీంతో ఏజెంట్ ఓటిటి విడుదలపై బజ్ ఏర్పడింది.

ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం కేవలం 6.50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. నిన్నటితో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్స్ లో ఫుల్ రన్ క్లోజ్ అయింది. అంటే బయ్యర్స్ కి 30 కోట్ల రూపాయలకు పైగా నష్టం అన్నమాట. అందరూ తీవ్రంగా నష్టపోవడంతో బయ్యర్స్ నిర్మాతని నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారట.

ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అఖిల్ ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ లో 75% తిరిగి నిర్మాతకి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ఆయన సుమారుగా 15 నుండి 20 కోట్ల రూపాయల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్. దీంతో రెండేళ్ల పాటు అఖిల్ చేసిన కష్టం వృథా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు