Lavanya Tripathi: మెగా ఇంటి కోడలు కానున్న మరో హీరోయిన్ – కలిసొచ్చేనా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం గురించి గత కొంత కాలంగా వస్తున్న వార్తల్ని నిజం చేస్తూ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా అభిమానులతో పాటు సామాన్యులు కూడా ఈ వేడుక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలిలో కోడలిగా ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ రూపంలో ఆ అదృష్టం వరించింది. నిజానికి లావణ్యకి టాప్ హీరోయిన్ రేంజ్ లేనప్పటికీ ఈ అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి. టాలీవుడ్ ని మకుటం లేని మహారాజులా ఏలుతున్న మెగా ఫ్యామిలీకి కోడలుగా రావటం లావణ్యకి కలిసొచ్చే అంశమే అని చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.

రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ ల వివాహం విడాకులకు దారి తీసిన ప్రస్తావన అప్రస్తుతం అయినప్పటికీ, వరుణ్ లావణ్యల బంధానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మెగా ఈవెంట్ సందర్బంగా మెగా హీరోల హీరోల సినిమా షూటింగులకు హాలిడే ప్రకటించినట్లు సమాచారం అందుతోంది.

మొత్తానికి హాట్ టాపిక్ గా మారిన ఈ మెగా ఈవెంట్ డీటెయిల్స్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఫంక్షన్ కి మెగాఫ్యామిలీ మాత్రమే అటెండ్ అవుతుందా లేక ఇండస్ట్రీ వర్గాలు, సెలెబ్రెటీలకు కూడా ఆహ్వానం ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది.  ఫంక్షన్ ఎక్కడ జరగనుంది, ఈవెంట్ కి ఎవరెవరు హాజరు కానున్నారు వంటి అంశాల పట్ల ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో వివరాలు తెలియాలంటే వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు