Narasimhanayudu: వరుస బెట్టి రీ రిలీజ్ అవుతున్న బాలయ్య సినిమాలు? మళ్ళీ అదే తప్పు జరుగుతుందా?

నందమూరి అభిమానులు కసిమీదున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానుల వింత పోకడ ఏమి అర్ధం కావడం లేదు. ఒకప్పుడు గొప్పలకు హీరోలకు ఫస్ట్ డే రికార్డులు ఉండాలని కామన్ ఆడియన్స్ సినిమాకు రాకపోయినా అభిమానులే సినిమా టిక్కెట్లు కొని చుసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్ మళ్ళీ బాలయ్య అభిమానుల ద్వారా రిపీట్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా రీ రిలీజ్ అయ్యి కొత్త రికార్డులను సృష్టించి దాదాపు 7.20 కోట్లకి పైగా వసూలు చేసింది. ఈ రికార్డును బ్రేక్ చెయ్యాలని నందమూరి అభిమానులు పని గట్టుకుని మరీ సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాస్ సినిమాను చూడడానికి ఎక్కువగా ఫ్యాన్స్ మాత్రమే వచ్చారు. అదికూడా మొదటి రోజు కాగానే అందరు లైట్ తీసుకున్నారు. ఫలితంగా కామన్ ఆడియన్స్ సపోర్ట్ లేక మొదటి రోజుకే పరిమితమైంది ఆ సినిమా. ఓవరాల్ గా టాప్ 2 గా నిలిచింది సింహాద్రి.

ఇప్పుడు మళ్ళీ నందమూరి అభిమానులు అలాగే గొప్పలకు పోయి బాలయ్య సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు బాలకృష్జ నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమాను రీ రిలీజ్ చేయగా పరవాలేదనిపించింది. అయితే అభిమానులు మాత్రం అదే పనిగా బాలయ్య పాత సినిమాలను రీ రిలీజ్ చేయించే పనిలో ఉన్నారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా జూన్ 10న బాలకృష్ణ నటించిన “భైరవ ద్వీపం”, అలాగే “నరసింహ నాయుడు” ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇవే గాకుండా సమరసింహారెడ్డి ని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు అభిమానులు.

- Advertisement -

అయితే ఎన్టీఆర్ బర్త్ డే రోజు విడుదలైన సింహాద్రి సినిమాకు హౌస్ ఫుల్ కావడానికి నందమూరి అభిమానులు చాలా కష్టపడ్డారు. కొంతమంది రెండేసి టిక్కెట్లు కొని హౌస్ ఫుల్ చేసారు. డిమాండ్ ఉన్న ఏరియాల్లో అయితే పరవాలేదు. కానీ ఎన్నిచోట్ల రిలీజ్ చేస్తే హౌస్ ఫుల్ కాలేక ఫ్యాన్స్ మళ్ళీ గొప్పలకు పోయి టిక్కెట్లు ఎక్కువ కొని ఇబ్బంది పడతారని అనిపిస్తుంది. అందులోను బాలయ్య అభిమానులకు పౌరుషం ఎక్కువే. మరి చూడాలి ఏమవుద్దో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు