Re Release Trend: సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా? ఇప్పుడిదే ట్రెండు?

టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ ల ట్రెండు పీక్స్ కి వెళ్ళిపోయింది. టాలీవుడ్ హీరోలు నటించిన పాత చిత్రాలను ఇప్పటికి చూడలేకపోయిన ప్రేక్షకులకోసం, మరోసారి చూడాలన్న అభిమానుల కోసం ఆయా హీరోల క్లాసిక్ సినిమాలను, బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఫ్యాన్స్ డిమాండ్ మేరకు రీ రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల బర్త్ డే కి లేదా మరేదైనా స్పెషల్ డే రోజున ఈ సినిమాలను మళ్ళీ విడుదల చేస్తున్నారు. మొదట సిటీ ఏరియాల్లో చాలా తక్కువ స్క్రీన్ లలో ఫ్యాన్స్ కోసమే ప్రదర్శించేవారు. ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా అన్ని రకాల ఆడియన్స్ కోసం విడుదల చేస్తున్నారు. పోకిరి తో మొదలైన ఈ ట్రెండ్ అందరి స్టార్ హీరోల సినిమాలు విడుదల చేసే వరకు వెళ్ళింది.

తాజాగా ఎన్టీఆర్ నటించిన సింహాద్రి కూడా తన బర్త్ డే కానుకగా విడుదల చేయడం జరిగింది. అయితే అభిమానులు రీ రిలీజ్ సినిమాల కలెక్షన్ల రికార్డులను కూడా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రీసెంట్ గా విడుదలైన సింహాద్రి సినిమాను నందమూరి అభిమానులు ఖుషి ని బ్రేక్ చేయడానికి ఎంతగా ప్రయత్నించారో తెలిసిందే. కానీ న్యూట్రల్ ఆడియన్స్ చూడకపోవడంతో ఆ సినిమాకు రెండో రోజు నుంచే థియేటర్లు ఖాళీ అయిపోయాయి.

తాజాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ సీనియర్ హీరోల దాకా వెళ్ళింది. ఈ మధ్యనే చిరంజీవి, బాలకృష్ణ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా మొదటి తరం అగ్ర హీరోలకు కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని తగిలిస్తున్నారు ఫ్యాన్స్. కొన్ని రోజుల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ జయతి సందర్బంగా ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాత ఆదిశేషగిరిరావు ప్రకటించడం జరిగింది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ట్రైలర్ ని కూడా లాంచ్ చేయించడం జరిగింది.

- Advertisement -

ఇప్పుడు తాజాగా సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్బంగా “అడవి రాముడు” చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. సింహాద్రి సినిమాను అభిమానులు దగ్గరుండి రిలీజ్ చేసినట్టే, మే 28న వరల్డ్ వైడ్ గా అడవిరాముడు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే డిమాండ్ ని బట్టి సినిమాను రిలీజ్ చేయాలి గాని, బర్త్ డే సందర్బంగా ఏది పడితే అది రిలీజ్ చేస్తే ఆ హీరో అభిమానులు తప్ప, ఇతర హీరోల ఫ్యాన్స్, ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ చూడరు. అది అభిమానులు, చిత్ర నిర్మాతలు తెలుసుకోవాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు