NTR31: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్…!

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇంకా షూటింగ్ మొదలు కానీ ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందట. ప్రస్తుతానికి ఇది రూమర్ అయినప్పటికీ, ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి తన మకాం మార్చిన ప్రియాంకకు అక్కడ ఆశించిన స్థాయిలో స్టార్ డం దక్కలేదనే చెప్పాలి. ఇటీవల ప్రియాంక నటించిన సిటాడెల్ సిరీస్ కూడా హాలీవుడ్లో అవకాశాలు తెచ్చిపెట్టలేదు. ఈ క్రమంలో ప్రియాంక మళ్లీ బాలీవుడ్ ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్థాయి ఇంటర్నేషనల్ రేంజ్ కి పెరిగిన తరుణంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తెలుగు డైరెక్టర్స్ తో, తెలుగు సినిమాలు సైన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా కూడా తెలుగు సినిమాలో నటించనుందన్న వార్త ఆశ్చర్యమేమీ కలిగించట్లేదు. ఈ వార్త గనక నిజం అయితే, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదలకి సిద్ధమవుతున్న క్రమంలో దేవర తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా మొదలవనుంది. మొత్తానికి సినిమాపై ఆసక్తి పెంచుతున్న ఈ రూమర్ నిజామా కాదా తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు