Custody: సమంతతో విడాకులకు కారణం ఎవరో చెప్పిన చైతు..!

అక్కినేని నాగ చైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకొని చాలా కాలమే అయినప్పటికీ తరచూ ఎవరో ఒకరు ఆ ప్రస్తావన తెస్తూ ఉండటం వల్ల ఇద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో ముమ్మరంగా పాల్గొంటున్న నాగ చైతన్య సమంతతో విడాకులకు కారణం ఏంటో చెప్పటంతో మళ్ళీ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు తమ విడాకుల కారణం ఏంటన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులే తమ ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీశాయని అన్నారు. ఆ వదంతుల వల్ల మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం లేదు అన్నట్లుగా ప్రాజెక్ట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

తమ గురించి పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేయటం తనని ఎంతగానో బాధించిందని అన్నారు. తమతో ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తిని కూడా ఈ వ్యవహారంలోకి లాగారని, ఇది చాలా దారుణం అని అన్నారు. అంతే కాకుండా సమంత చాలా మంచి మనసున్న వ్యక్తి అని, ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటానని చెప్పాడు చైతన్య. తన వ్యక్తిగత జీవితం గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయని, వాటిని పట్టించుకోనని అన్న చైతు, తన పెళ్లి గురించి కూడా వదంతులు ఎందుకు వస్తున్నాయో తెలీదని అన్నాడు.

ఇదిలా ఉండగా, వెంకట్ ప్రభు డైరెక్షన్లో నాగచైతన్య సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన కస్టడీ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య కెరీర్లో హిట్ కీలకమైన దశలో వస్తున్న కస్టడీ సినిమాఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచుతోంది. వెంకట్ ప్రభు సినిమాల్లో కథ, కథనాలు విభిన్నంగా ఉంటాయన్న పేరు ఉండటం వల్ల అక్కినేని అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి కస్టడీ సినిమా అయినా హిట్ అయ్యి అక్కినేని వారి డిజాస్టర్స్ పరంపర కి బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు