Custody: సమంత ని ఫాలో అవుతున్న చైతు – ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా..?

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. పెళ్లైన కొన్ని సంవత్సరాలకే వీరి వివాహ బంధం విడాకులకు దారి తీయటం అప్పట్లో సంచలనం కాగా తరచూ ఎవరో ఒకరు ఆ ప్రస్తావన తేవటం వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ విషయంలో నాగచైతన్య కంటే సమంతకు ఎక్కువ ప్రశంలు ఎదురయ్యాయని చెప్పాలి. మీడియా ముఖంగా చాలా సార్లు స్పందించిన సమంత ఎప్పటికప్పుడు తనపై వస్తున్న రూమర్స్ కి గట్టి సమాధానం ఇస్తూ వస్తోంది. విడాకుల విషయంపై ఎప్పుడూ రెస్పాండ్ అవ్వని చైతు ఇటీవల కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు.

యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన చైతు సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లనే తమ మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. సమంత లవ్లీ లేడీ అని తను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటా అని అన్నాడు. ఎప్పుడు లేనిది చైతు ఇలా స్పందించటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చైతు కూడా సమంత ని ఫాలో అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. సమంత కూడా పలు మార్లు సినిమా ప్రమోషన్స్ సమయంలో తమ విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, ఇదంతా సింపతీ కోసమే చేస్తోందని, సినిమా ప్రమోషన్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్న విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం చైతు కూడా కస్టడీ సినిమా ప్రమిషన్స్ లో పాల్గొంటూ ఉండటం ఎప్పుడూ లేనిది విడాకుల విషయంపై స్పందించటం విమర్శలకు తావిస్తోంది. సమంత లవ్లీ లేడీ అన్న సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ సమంత ఫ్యాన్స్ చైతు పై ఫైర్ అవుతున్నారు. నాగచైతన్య కూడా సింపతీ కోసమే సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా, సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇలాగే ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ సినిమా డిజాస్టర్ అయ్యింది. మరి, చైతూకి హిట్ కీలకమైన దశలో వస్తున్న కస్టడీ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు