Megastar: చిరంజీవికి స్టార్ డైరెక్టర్స్ మీద నమ్మకం లేదా..?

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత యువ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.మొదట్లో సీనియర్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ప్రిఫరెన్స్ ఇచ్చిన చిరు, ప్రస్తుతం తన ఆలోచన తీరుని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి తర్వాత బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో ఒక సినిమా, కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో ప్రసన్న బెజవాడ అందించే కథతో సినిమా చేయనున్నాడని వార్తలే ఇందుకు నిదర్శనం. చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా అనౌన్స్ చేయకముందు పూరిజగన్నాథ్ తో ఆటోజానీ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి. అయితే, పూరి వినిపించిన కథ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళలేదు.

వినయ విధేయ రామ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో డీవీవీ బ్యానర్ పై త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తానని స్వయంగా చిరంజీవే ప్రకటించినా ఏ కారణం చేతనో ఈ కాంబో కూడా వర్కౌట్ కాలేదు. ఆ మధ్య గాడ్ ఫాదర్ సినిమా సమయంలో చిరంజీవి కొత్త కథ తెమ్మని పూరికి చెప్పినా ఇంతవరకు అందుకు సంబంధించిన అప్డేట్ ఏదీ లేదు. ఇప్పుడు చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్న నేపథ్యంలో సీనియర్ డైరెక్టర్స్ తో వర్క్ చేసే ఛాన్స్ సమీప దూరంలో లేనట్లే అని స్పష్టం అవుతోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ ని ఎఫెక్టివ్ గా డీల్ చేసిన పూరి, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు ఛాన్స్ ఇవ్వకపోవటం వెనక చిరంజీవి ఆంతర్యం ఏమై ఉంటుందా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వటం వెనక స్ట్రాంగ్ రీజన్ ఉందని తెలుస్తోంది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ ప్రభావమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తే తన రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని, అదే యంగ్ డైరెక్టర్స్ అయితే, రెమ్యునరేషన్ విషయంలో ఆ తలనొప్పి ఉండదని భావిస్తున్నాడట.పైగా యంగ్ డైరెక్టర్స్ తన సలహాలు సూచనలకు ఇచ్చినంత విలువ సీనియర్ డైరెక్టర్స్ ఇవ్వరని కూడా చిరంజీవి భావిస్తున్నాడట. మరి, మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలన్న సీనియర్ డైరెక్టర్స్ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు