Adipurush: సర్వత్రా విమర్శలు – ప్రభాస్ మాత్రం సేఫ్ – ఇదెలా సాధ్యం..!

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొని ఎంత నెగిటివిటీని మూట కట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామాయణం లాంటి  ఎపిక్ స్టోరీని సీనిమాటిక్ లిబర్టీ పేరుతో ఇష్టమొచ్చినట్లు మార్పులు చేయటం వల్ల దర్శకుడు ఓం రౌత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 1000కోట్ల గ్రాస్ టార్గెట్ గా వచ్చిన ఈ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించటం కూడా కష్టమైన పరిస్థితి తలెత్తింది. సినిమా రిలీజ్ కి ముందు భుజాన మోసి మరీ ప్రమోట్ చేసిన హిందుత్వ సంఘాలు సైతం రిలీజ్ తర్వాత సినిమాపై వ్యతిరేక వాణి వినిపించాయి.

సినిమాపై ఈ రేంజ్ లో నెగిటివిటీ వస్తున్నా కూడా హీరో ప్రభాస్ కి మాత్రం ఆ నెగిటివిటీ ఏ మాత్రం సోకలేదు. ఇందుకు కారణం ప్రభాస్ వ్యక్తిత్వమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నెగిటివిటి రావాల్సింది పోయి ప్రభాస్ మీద సానుభూతి పవనాలు వీస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ క్రేజ్ ని చూసి ఓర్వలేక బాలీవుడ్ వర్గాలు కుట్ర పన్నాయని, అందుకే ఆదిపురుష్ ని డిజాస్టర్ అయ్యేలా రూపొందించారని ఒక వర్గం అభిప్రాయపడుతోంది.

బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్, ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆదిపురుష్ కి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రావటం ప్రభాస్ స్టామినాకి, క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. ఈ క్రమంలో ప్రభాస్ తదుపరి సినిమా సలార్ పైనే అభిమానులు ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్న నేపథ్యంలో సలార్ ద్వారా ప్రభాస్ కి పాన్ ఇండియా హిట్ దక్కుతుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు