Dasara: నాని వచ్చేది కాస్త ముందుగానే..

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ దసరా. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నుంచి వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తుండగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోదావరి ఖనిలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ తో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. టీజర్ లో నాని లుక్స్, బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా స్లాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

టీజర్ తోనే సినిమాపై ఇంతటి బజ్ క్రియేట్ కావడంతో, ట్రైలర్ వస్తే.. పరిస్థితి మరోలా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. ఈ సినిమాను మార్చి 30 ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాకాలు చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా విడుదల తేదీకి ఒక వారం ముందు.. ట్రైలర్ ను విడుదల చేయాలని మూవీ టీం ముందుగా ప్లాన్ చేశారు. అయితే సినిమాపై హైప్ క్రియేట్ చేయాలంటే.. ట్రైలర్ ను ఇంకా ముందే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక వేళ ట్రైలర్ ముందే వస్తే.. సినిమాపై బజ్ భారీ స్థాయిలో పెరుగుతుంది. దీన్ని విడుదల తేదీ వరకు కంటీన్యూ చేసేలా ప్లాన్స్ కూడా వేస్తున్నారట. అంటే.. సాంగ్స్, పోస్టర్లు, సినిమా నుంచి కొన్ని డైలాగ్స్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

- Advertisement -

కాగా, దసరా టీం ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్లు జరుపుతున్నారు. హీరో నాని డైరెక్ట్ ప్రేక్షకుల మధ్యకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. సినిమా విజయం ఖాయమని, అది ఎంత పెద్ద విజయం అనేది మాత్రమే తెలియాల్సి ఉంది అంటూ పలు ఈవెంట్స్ లో అంటున్నాడు. ఇంతలా ప్రమోషన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ మరి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు