Agent: ప్రమోషన్స్ లో కనిపించని డైరెక్టర్ – కారణమేంటో..?

అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన ఏజెంట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్లో మొదటిసారి నటించిన స్పై థ్రిల్లర్ సినిమా కావటం, అఖిల్ మార్కెట్ రేంజ్ ని మించి 80కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ ముందు వరకు పెద్దగా బజ్ లేని ఈ సినిమాకు ట్రైలర్ రిలీజ్ అయ్యాక కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేసిన ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రమోషన్స్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కువగా కనిపించకపోవటం చర్చకు తావిస్తోంది.

సినిమా ప్రమోషన్స్ మొదలు కాకముందు షూటింగ్ పెండింగ్ ఉన్న కారణంగా  డైరెక్టర్ కి నిర్మాతకి విభేదాలు ఏర్పడ్డాయని, సురేందర్ రెడ్డి వల్లే సంక్రాతి రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిలే అయ్యిందని వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రమోషన్స్ లో సురేందర్ రెడ్డి యాక్టివ్ గా లేకపోవటం చుస్తే ఆ వార్తలు నిజమేనేమో అన్న అనుమానం వస్తోంది.

అసలు విషయానికి వస్తే, సినిమా యూనిట్ అంత ప్రమోషన్స్ లో బిజీగా ఉంటే సురేందర్ రెడ్డి మాత్రం ఎడిటింగ్ రూమ్ లో సినిమాకు అవసరమైన తుది మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నారని అందుకే ప్రమోషన్స్ లో కనిపించలేదని సమాచారం అందుతుంది. ఈ క్రమంలో అఖిల్, సురేందర్ రెడ్డిల కెరీర్లో హిట్ కీలకమైన దశలో వస్తున్న ఏజెంట్ అంచనాలు అందుకొని అఖిల్ ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు