Prabhas: సలార్ క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కలయికలో భారీ బడ్జెట్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ సిద్ధంగా ఉన్న ఆదిపురుష్ సినిమాకంటే సలార్ మీదనే ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే, ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవటంతో ఒకింత నిరాశలో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఈ నేపద్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచేలా సలార్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట.

కేజీఎఫ్ సినిమా ద్వారా యాక్షన్ సీక్వెన్స్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో అంతకు మించిన రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ లో భారీ బాంబ్ బ్లాస్ట్ లు, ఆద్యంతం రక్తపాతంతో ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడట. వాయిలెన్స్ తో పాటుగా ఈ ఎపిసోడ్ లో ఎమోషన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతోందని అంటున్నారు. ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాకుండా నార్మల్ ఆడియెన్స్ లో కూడా అంచనాలను పెంచుతోంది. అంతే కాకుండా ప్రభాస్ రెండో పాత్రని కూడా రివీల్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

విజువల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉండబోయే ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ ఔట్ అండ్ ఔట్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడని సమాచారం. సాహో సినిమా తర్వాత ప్రభాస్ ఫుల్ లెంత్ యాక్షన్ సినిమా చేయకపోవటంతో సలార్ సినిమా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అయితే బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ వంటి వరుస ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ నిలవాలంటే ఆదిపురుష్ సినిమా హిట్ అవ్వటం ఎంతో కీలకంగా మారింది. క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి వస్తున్న వార్త గనక నిజమే అయితే అది సినిమాకే హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ ఆదిపురుష్ తో హిట్ అందుకొని తర్వాత సలార్ సినిమాతో తన పాన్ ఇండియా జైత్ర యాత్రను కొనసాగిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు