Samajavaragamana: మూడో వారంలో కూడా శ్రీవిష్ణు హవా తగ్గట్లేదు…!

శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లతో శ్రీవిష్ణు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా కానీ, వీకెండ్స్ లో చాలా హౌస్ ఫుల్ షోస్ తో దూసుకుపోతుంది. ఇప్పటిదాకా 47కోట్ల రూపాయల గ్రాస్, సుమారు 29కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా యూఎస్ లో 1 మిలియన్ కి చేరువలో ఉంది. ఇప్పటి దాకా 950k డాలర్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా త్వరలోనే మిలియన్ మార్క్ చేరే అవకాశం ఉంది.

శ్రీవిష్ణు గత చిత్రాలు కామెడి జానర్ కాకుండా సీరియస్ కథలను ఎంచుకొని డిజాస్టర్స్ చవి చూసాడు. మళ్లీ తన కామెడి జానర్లో చేసిన సామజవరగమన సినిమా ద్వారా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొని టైర్2 హీరోల సరసన నిలిచాడు. క్లీన్ కామెడీతో రూపొందిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. సామజవరగమన రిలీజైన రోజే వచ్చిన స్పై సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోవటం, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోకపోవటం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పాలి.

మరో పక్క రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న బేబీ సినిమా థియేటర్స్ లో ఉన్నప్పటికీ సామజవరగమన సినిమాకి వీకెండ్ లో హౌస్ ఫుల్ షోస్ పడటం విశేషం. బేబీ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నప్పటికీ కొంత డివైడ్ టాక్ రావటం కూడా ఇందుకు కారణంగా చెప్పచ్చు. మొత్తానికి శ్రీవిష్ణు చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ అందుకోవటమే కాకుండా ఈ సినిమాతో టైర్2 హీరోల సరసన చేరాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు