Tollywood: ఆ డైరెక్టర్లకు మానని గాయాన్ని మిగిల్చిన సినిమాలు..!

ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్, హీరోతో పాటు ఆ సినిమా యూనిట్ మొత్తానికి క్రెడిట్ దక్కుతుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే అందరి వేళ్ళు డైరెక్టర్ వైపే చూపిస్తాయి. సినిమా రిజల్ట్ విషయంలో దర్శకుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది, సినిమా హిట్ అయితే డైరెక్టర్ రేంజ్ పరుగుతుందా లేదా అన్నది చెప్పలేం గానీ, ఒక్క ఫ్లాప్ పడితే మాత్రం దర్శకుడు కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. అలా కొంతమంది దర్శకులకు మానని గాయాన్ని మిగిల్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఎన్నో అంచనాలతో గతేడాది రిలీజ్ అయిన సినిమా లైగర్ ఎంత డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పూరికి దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా పూరి, ఛార్మీలకు కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సినిమా పంపిణీ విషయంలో నెలకొన్న వివాదం ఇప్పటికీ సద్దుమణగలేదు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్లో అజ్ఞాతవాసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. జల్సా తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా కావటంతో అజ్ఞాతవాసికి మంచి హైప్ క్రియేట్ అయ్యింది అప్పట్లో. 2018 సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సైతం నిరాశకు గురి చేసింది. అజ్ఞాతవాసి డిజాస్టర్ కి కారణం త్రివిక్రమ్ మాత్రమే అంటూ ఏకధాటిగా విమర్శలొచ్చాయి అప్పట్లో. అయితే, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టి తన సత్తా చాటాడు త్రివిక్రమ్.

కొత్తబంగారులోకం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించిన శ్రీకాంత్ అడ్డాల కెరీర్లో బ్రహ్మోత్సవం సినిమా కోలుకోలేని దెబ్బ తీసిన సినిమాగా నిలిచింది. ఆ మధ్య వెంకటేష్ హీరోగా ఓటీటీలో రిలీజ్ అయిన నారప్ప సినిమా ద్వారా హిట్ అందుకున్నప్పటికీ, బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత ఆ సినిమా అవకాశం రావటానికి శ్రీకాంత్ అడ్డాలకి 5సంవత్సరాలకు పైనే సమయం పట్టింది. మరో దర్శకుడు శ్రీనువైట్లకు వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ ఆగడు సినిమా పెద్ద షాక్ ఇచ్చిన సినిమాగా మిగులుతుంది. ఆ సినిమా ఏ క్షణాన తీసాడో కానీ, అప్పటి నుండి వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి శ్రీనువైట్లని.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు