Ustaad Bhagat Singh: పవన్ ను రిక్వెస్ట్ చేస్తున్న హరీష్.. సాధ్యమవుతుందా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వీరు కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసిందే. 2012 సమ్మర్ లో విడుదలైన ఆ సినిమా పవన్ కళ్యాణ్ కు ఖుషి తర్వాత ఆ రేంజ్ హిట్ ని ఇచ్చింది. మగధీర తర్వాత ఆ స్థాయి విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో 2వ స్థానంలో నిలిచింది. హరీష్ శంకర్ ఈ సినిమా తోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ తేరి కి పలు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హరీష్ శంకర్ దాదాపు 90 రోజుల కాల్షీట్లు కావాలని పవన్ ని సంప్రదించినట్లు సమాచారం. పవన్ కూడా దీనికి అంగీకరించాడని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గత అయిదు ఆరు సినిమాల్లో ఏ సినిమాకు ఇన్ని రోజులు కేటాయించలేదు. కానీ హరీష్ శంకర్ సినిమాకోసం ఇన్నిరోజులు డేట్లు ఇవ్వగలడా అని ట్రేడ్ వర్గాల్లో లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హరిహర వీరమల్లు, సముద్ర ఖని తో చేస్తున్న సినిమాలోనూ బిజీ గా ఉన్న పవన్, అటు జనసేన పార్టీ పనుల్లో ఉంటూ వీలైనప్పుడు మాత్రమే ఈ షూటింగుల్లో పాల్గొంటున్నాడు.

- Advertisement -

ఏది ఏమైనా 3 సినిమాల షూటింగ్ లతోనే సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు ఈ సినిమాకి ఎలా డేట్స్ అడ్జస్ట్ చేస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు