Harish Shankar: విమర్శలు పుట్టుకొస్తున్నాయి

పవర్ స్టార్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా ”ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా గురించి అప్డేట్ చేయాలనుకున్న సమయానికి,పవర్ స్టార్ ఫ్యాన్స్ వారి అసహనాన్ని వ్యక్త పరచటంతో, ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ ఫ్యాన్స్ కి ఇవ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. ఇది ”తేరి” సినిమా రీమేక్ ఆ కదా అని సినిమా చూసిన తర్వాత తెలుసుకోండి అని ఫ్యాన్స్ కే వదిలేసాడు.

నిజానికి, సినీ లవర్స్ అంత పవన్ కళ్యాణ్ చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ రీమేక్ ఫిలిమ్స్ గురించి ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ హరీష్ శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఫ్యాన్స్ పవర్ ఫుల్ ఒరిజినల్ ఫిలిం నే కోరుకుంటారు. కానీ, రైటర్ దశరథ్ ఈ విషయం పై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ”తేరి” లో కొన్ని మార్పులు చేసి రీమేక్ గా రూపొందిస్తున్నారు అని చెప్పాడు. ఇక ఇది ఫ్యాన్స్ ని అప్సెట్ చేసే విషయమే. వకీల్ సాబ్ సినిమా తర్వాత భీమ్లా నాయక్, వినోదయ సీతం రీమేక్ సినిమాలే. వీటి తర్వాత ఇప్పుడు తేరి కూడా రీమేక్ అంటే, ఫ్యాన్స్ కి నిరాశగా మారింది.

హరీష్ దర్శకత్వంలో వచ్చే సినిమా రీమేక్ ఆ , డైరెక్ట్ ఆ అనే సందేహంలో ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించడం వాస్తవమే, తమ అభిమాన హీరోతో మరో అభిమానైన హరీష్ శంకర్ ఎటువంటి కథను చేస్తున్నాడు అని క్యూరియాసిటీ అభిమానులకు ఉండటం సహజం. ఆ ఉద్దేశ్యం తో అడిగిన అభిమానులపై…

- Advertisement -

“తేరి రీమేక్ ఆ కాదా, అనేది మీరు వెండితెర మీదనే చూడాలి. ప్రతి సారి నా ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకునేవాడ్ని. మొన్న కొంచెం అతి చేసారు సోషల్ మీడియా లో actually నేను రీమేక్ ఆ, కాదా అన్నది చెప్పాలనుకున్నాఈ సినిమా ఎందుకు తీస్తున్నాం, ఆ సినిమా ఎందుకు తియ్యాట్లేదు అని చెప్పాలని అనుకున్నా కానీ Too much గా బిహేవ్ చేశారు నేను చెప్పా తలుచుకొలేదు. మేము అనుకున్న టైమ్ కి షూటింగ్
చేస్తే 2024 పొంగల్ రిలీజ్ చేస్తాం.”

ఇలా అతి అని అభిమానులను అనడం పై హరీష్ పై కొద్దిపాటి విమర్శలు పుట్టుకొస్తున్నాయి.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు