Pawan Kalyan: ఫ్యాన్స్ ను తక్కువ అంచనా వేసిన హరీష్ శంకర్..!

హరీష్ శంకర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు, మిరపకాయ్ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ సెట్ చేసుకున్న ఈ డైనమిక్ డైరెక్టర్ గబ్బర్ సింగ్ తో తాను స్టార్ డైరెక్టర్ గా ఎదగటమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమాను ఇచ్చాడు. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గడ్డలకొండ గణేష్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హరీష్ ఇటీవలే పవణ్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేసాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసమే హరీష్ శంకర్ ఇంత గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గతంలోనే అనౌన్స్ చేసినప్పటికీ సెట్స్ పైకి వెళ్తుందా వెళ్లదా అన్న అనుమానాలు ఉండేవి.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావటంతో సినిమా ఉంటుందన్న క్లారిటీ వచ్చింది. అయితే సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఫొటోను చుస్తే అందులో ఉన్నది పవన్ కళ్యాణేనా లేక హరీష్ శంకరా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే గతంలో గబ్బర్ సింగ్ సినిమాలో ఒక సీన్లో పవన్ కళ్యాణ్ కు బదులు హరీష్ శంకర్ కనిపించటం, ఈ విషయం స్వయంగా హరీష్ శంకర్ వెల్లడించే వరకు పెద్దగా ఎవరికీ తేలికపోవటం ప్రస్తుతం వస్తున్న అనుమానాలకు కారణం.

అప్పట్లో అంటే ఇప్పటిలా సోషల్ మీడియా వాడకంలో లేదు కాబట్టి విషయం ఎవరికీ తెలియలేదు. కానీ, ఇప్పుడు ఇలా ట్రైలర్ కానీ టీజర్ రిలీజ్ అయ్యిందో లేదో నిమిషాల్లోనే అందులో లూప్ హోల్స్ వెతికి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో నిన్న రిలీజ్ చేసిన ఫొటోలో ఉన్నది హరీష్ శంకర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి, పవన్ కళ్యాణ్ కి బదులు తాను ఫోటో దిగి అప్డేట్ ఇవ్వాల్సిన తొందర హరీష్ శంకర్ కి ఏమొచ్చిందో తెలియాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు