Balagam : వేణుది కాన్ఫిడెన్సా ?, ఓవర్ కాన్ఫిడెన్సా?

కమెడియన్ నుండి డైరెక్టర్ గా మారిన వేణు బలగం సినిమా ద్వారా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా థియేటర్లకు జనాన్ని రప్పించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన బలగం సినిమా కథకి ఉన్న బలం ఏంటో ప్రూవ్ చేసిందన్న ప్రశంసలు కూడా అందుకుంది. వేణు ట్యాలెంట్ కి ఫిదా అయిన దిల్ రాజు రెండో సినిమా కూడా తన బ్యానర్లోనే చేసే ఛాన్స్ ఇచ్చాడు వేణుకి. అయితే, వేణు తన రెండో సినిమాకి స్టార్ హీరోలు కావాలని డిమాండ్ చేస్తున్నాడట. రెండో సినిమాకు తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ డ్రామా కథని సిద్ధం చేసే పనిలో ఉన్న వేణు , ఆ కథతో స్టార్ హీరోలను ఒప్పించటం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.

ఒక యావరేజ్ సినిమా చేస్తేనే స్టార్ డైరెక్టర్ల లెవెల్లో ఫీల్ అయ్యే దర్శకులు ఉన్న ఈ రోజుల్లో బలగం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు ఈ రేంజ్ లో డిమాండ్ చేయటంలో తప్పు లేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే, బడ్జెట్ పరంగా లిమిటేషన్స్ పెట్టని దిల్ రాజు వేణు సిద్ధం చేసిన కథకి స్టార్ హీరోలను ఎలా ఒప్పిస్తాడు అన్నది ఆసక్తిగా మారింది.

అయితే, బలగం సినిమాలో కథకి, పాత్రలకి తగ్గట్టు నటులను ఎంచుకున్న వేణు ఇప్పుడు ఇలాంటి  కథకి స్టార్ హీరోలను డిమాండ్ చేయటం కొంతవరకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అనిపిస్తుంది. బలగం లాంటి రా అండ్ ఎమోషనల్ కథని స్టార్ హీరోలతో డీల్ చేయగలడా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన కమెడియన్ వేణు రెండో సినిమాతో ఎలా అలరిస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు