Balagam: అక్కడ కూడా బలగం బ్లాక్ బస్టరే..!

కమెడియన్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన బలగం సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో స్ట్రీమ్ అవుతున్న సమయంలో కూడా థియేటర్లో హౌస్ ఫుల్ గా నడవటం ఒక ఎత్తైతే, పల్లెల్లో జాతర సమయాల్లో లాగా పబ్లిక్ స్క్రీనింగ్స్ లో జనాలు సినిమా చూడటం మరో ఎత్తు. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ గా నిలవటమే కాకుండా అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ప్రదర్షింపబడి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. మానవ సంబంధాలు, కనుమరుగవుతున్న మన సాంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా చూసి విడిపోయిన కుటుంబాలు కూడా కలిసాయంటేనే తెలుస్తుంది ఈ సినిమా జనాల మీద ఎంత ప్రభావం చూపిందో.

థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇటీవలే బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యింది. స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో 14.30 టీఆర్ఫీ రేటింగ్ సాధించి బుల్లితెరపై కూడా తన సత్తా చాటింది. ఒక్క హైదరాబాద్ సెగ్మెంట్ లోనే 22 టీఆర్ఫీ రేటింగ్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ మధ్య కాలంలో ఇంతటి రేటింగ్ సాధించిన ఏకైక సినిమాగా నిలిచింది బలగం.

కథలో బలం ఉంటే సినిమాలో స్టార్ లు లేకపోయినా, భారీ బడ్జెట్ తో కమర్షియల్ హంగులు లేకపోయినా ప్రేక్షకుడు ఆదరిస్తాడని ప్రూవ్ చేసింది బలగం. అప్పటివరకు కమెడియన్ గానే తెలిసిన వేణు, తొలి ప్రయత్నంలోనే బలగం లాంటి బ్లాక్ బస్టర్ అందుకొని అందరినీ ఆశ్చర్య పరిచి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు. వేణు నుండి భవిష్యత్తులో బలగం లాంటి మరిన్ని సినిమాలు వస్తాయో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు