RC15: “గేమ్ ఛేంజర్” లో రామ్ చరణ్ పాత్ర అదే?

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా రూపొందుతున్న చిత్రాల్లో ఒకటి “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలుంన్నాయి. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో 2021 లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. మధ్యలో రామ్ చరణ్ RRR ప్రమోషన్లకి గ్యాప్ తీసుకోగా, ఆ గ్యాప్ లో శంకర్ ఇండియన్2 చేస్తున్నాడు.

అయితే “గేమ్ ఛేంజర్” నుండి ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప వేరే ఏ అప్డేట్ కూడా రాలేదు. కానీ అప్పుడప్పుడు లీక్ అవుతున్న స్టిల్స్ మాత్రం సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా నుండి తాజాగా రామ్ చరణ్ రోల్ కి సంబంధించిన సమాచారం వచ్చింది. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ ఒక ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర ఏంటనేది మాత్రం చెప్పలేదు.

కానీ లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని, తన పాత్ర పేరు “రామ్ నందన్ ఐఏఎస్” అని సమాచారం వచ్చింది. ఈ బజ్ నిజమో కాదో తెలియదు కానీ, ఐఏఎస్ రోల్ అంటే “ఒకే ఒక్కడు” సినిమా రేంజ్ లో ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అంతే కాక ఈ రోల్ కి సంబంధించి రీసెంట్ గా లీక్ అయిన స్టిల్ కూడా ఆకట్టుకుంది. ఫ్యాన్స్ మీట్ లో భాగంగా ఆ లుక్ లో ఉన్నప్పుడు ఫోటో తీసుకున్నారు. ఇప్పుడు ఆ లుక్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

- Advertisement -

ఇక ఈ రోల్ కాక సినిమాలో రాజకీయ నాయకుడిగా మరో పాత్ర కూడా ఉందని తెలిసిందే. ఆ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసాడు శంకర్. ఇక ఆ పాత్రకి సంబంధించి లుక్స్ లీక్ అయ్యి సెన్సేషన్ అయ్యాయి.

ఇక రామ్ చరణ్ తండ్రి అయ్యాక షూటింగ్ కు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి, ఇటీవలే మళ్ళీ గేమ్ ఛేంజర్ సెట్స్ లో అడుగుపెట్టాడు. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2024 లో సమ్మర్ లో రిలీజ్ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు