Shankar: ఏది ముందొస్తుంది? కన్ఫ్యూషన్ లో ఫ్యాన్స్ ?

దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్ లో మొదటి సరిగా రెండు చిత్రాలకు ఒకేసారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక పక్క కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా తీస్తున్నాడు. ఇటు రామ్ చరణ్ “గేమ్ చేంజర్” మూవీని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మామూలుగా తన ఒక్కో చిత్రానికి రెండేళ్ల వరకు టైమ్ తీసుకొనే శంకర్, ప్రస్తుత పరిస్థితుల నేపద్యంలో ఈ రెండు చిత్రాలకు ఒక్కో షెడ్యూల్ కేటాయించి షూటింగ్ చేస్తున్నాడు. అయితే ముందుగా ఇండియన్ 2 సినిమా మొదలు కాగా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.

అప్పుడే శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి పూనుకున్నాడు. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా 2021 లో గ్రాండ్ గా లాంచ్ అయింది ఈ సినిమా. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా గేమ్ చేంజెర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆగిపోయిందనుకున్న ఇండియన్ 2 మళ్ళీ పట్టాలెక్కడంతో రామ్ చరణ్ సినిమా కు అడ్డంకి గా మారింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ పైన చాలా కోపంగా ఉన్నారు.

శంకర్ ఎదో ఒక సినిమా ముందుగా ఫినిష్ చేసి తరువాత మరో సినిమా షూటింగ్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే శంకర్ మాత్రం రెండు సినిమాల షూటింగ్ లు మేనేజ్ చేస్తూ ఏది వీలైతే అది ముందు షూట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో అభిమానులతో పాటు ట్రేడ్ పండితులు కుడా చెప్పలేకపోతున్నారు. అయితే ముందుగా ఇండియన్ 2 సినిమా మొదలైంది. అందువల్ల ఆ సినిమా షూటింగ్ చాలా వరకు ఫినిష్ అయి ఉంటుంది. కాబట్టి శంకర్ ముందుగా ఇండియన్ 2 షూట్ మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత గేమ్ చేంజెర్ సినిమా షూట్ చేస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు