Rebel Star: ప్రభాస్, మారుతి సినిమా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారా..? 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్లో హారర్ జానర్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాల గురించి తరచూ ఏదో ఒక అప్డేట్ వినిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్నాయి. మారుతి సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేకపోవటం వల్ల షూటింగ్ జరగట్లేదని భావిస్తున్నారు అభిమానులు. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా పూర్తి చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయ్యిందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం.
హారర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ఎపిసోడ్ కూడా హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాకు రాజా డీలక్స్ అన్న టైటిల్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారని సమాచారం  భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలతో నిండిన ప్రభాస్ లైనప్ లో ఈ సినిమా రిఫ్రెషింగ్ గా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జూన్ మొదటి వారంలో మొదలవనున్న షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
2024 సమ్మర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్టులతో ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ కూడా కీలకంగా ఉంటుందని అంటున్నారు. అప్డేట్ ఏమీ లేకుండానే షూటింగ్ చక చకా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెట్స్ లో ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత పాల్గొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ నుండి వరుస యాక్షన్ సినిమాలు వస్తున్న తరుణంలో డిఫరెంట్ జానర్లో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు