Rebel Star: ఎవరు టచ్ చేయలేని రేంజ్ లో ప్రభాస్ మార్కెట్..!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. ఈ క్రమంలో యాక్షన్ సినిమాలతో నిండిన ప్రభాస్ లైనప్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచుతోంది. అన్ని అనుకున్నట్టే జరిగితే, ఒక ఏడాది కాలంలో ప్రభాస్ సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నటించే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 1000కోట్ల వసూళ్లు రాబట్టడం పెద్ద విషయమేమీ కాదన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

ఈ క్రమంలో ప్రభాస్ నుండి రాబోయే సినిమాలన్నీ హిట్ టక గనక సొంతం చేసుకుంటే ఏడాది వ్యవధిలో సుమారు 5000కోట్ల మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోగా రికార్డ్ సాధిస్తాడు ప్రభాస్. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని బట్టి సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ ప్రభాస్ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టేందుకు వెనకాడట్లేదు నిర్మాతలు. ఇక రాబోయే సినిమాలన్నీ హిట్ అయితే గనక ఇండియాలో ఏ హీరో కూడా ప్రభాస్ మార్కెట్ రేంజ్ ని అందుకోలేడని చెప్పచ్చు.

ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఇందులో కృతి సనన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాఫై అంచనాలు పెంచుతోంది. టీజర్ లో నాసిరకం విజువల్స్ ఉన్న కారణంగా వచ్చిన విమర్శలన్నిటికి ఒక్క ట్రైలర్ తో సమాధానం ఇచ్చింది సినిమా యూనిట్. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై లంచాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. గత చిత్రం రాధేశ్యామ్ తో డిజాస్టర్ మూట కట్టుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు