Agent: ‘స్పై థ్రిల్లర్’ అంటే అంతేనా – కొత్త కథలు రావా..?

సినిమా కథల్లో కొన్ని జానర్స్ కి యూనివర్సల్ రీచ్ ఉంటుంది. అలాంటి జానర్స్ లో ఏ భాషలో సినిమా తీసినా కానీ, ప్రపంచవ్యాప్తంగా రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ రీచ్ ఉన్న జానర్స్ లో ‘స్పై థ్రిల్లర్’ ఒకటి. ఈ జానర్లో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి ట్రెండ్ సెట్ చేసాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, ఇదే జానర్లో అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా విడుదలైంది. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు గ్రాండియర్ గా ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లోపించటంతో ఏజెంట్ ఆడియెన్స్ ని నిరాశ పరుస్తోంది.

ఇటీవల వచ్చిన పఠాన్, గూఢచారి వంటి సినిమాలతో ఏజెంట్ సినిమా కి చాలా పోలికలు ఉండటంతో సినిమా ఎక్కడా థ్రిల్లింగ్ గా అనిపించదు. చాలా వరకు స్పై సినిమాల్లో విలన్ మాజీ రా ఆఫీసర్ అయ్యుండటం, ఏజెంట్ సినిమాలో కుడా అదే రిపీట్ అవ్వటం ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. గతంలో వచ్చిన సినిమాల లాగా ఏజెంట్ కూడా మూస ధోరణిలో రొటీన్ స్పై థ్రిల్లర్ గా రూపొందటంతో అఖిల్ కి ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ దక్కే ఛాన్స్ ని మిస్ చేసింది. లుక్స్,బాడీ మేకోవర్ చేసుకొని సినిమా కోసం రెండేళ్లుగా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ అఖిల్ పడ్డ కష్టం అంతా కథలో కొత్తదనం లేకపోవటం వల్ల బూడిదలో పోసిన పన్నీరులా మారింది.

స్పై జానర్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ తో పాటు కథని ఎలివేట్ చేయటంలో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటిది ఏజెంట్ సినిమాకి పాటలు పెద్ద అడ్డంకిగా మారాయి, అంతే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా హిప్ హాప్ తమిళ ఏ మాత్రం మెప్పించలేక పోయాడు. ఇక ముందు చేసే స్పై జానర్ సినిమాల విషయంలో ఏజెంట్ సినిమాని దృష్టిలో పెట్టుకొని కధ, కథనాలలో కొత్తదనం ఉండేలా చూసుకుంటే మంచిది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు