Dil Raju: దిల్ రాజు సక్సెస్ కి అదే కారణమా..?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇండస్ట్రీలోకి ఎంటరై 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ 20ఏళ్లలో 50సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు అధిక సక్సెస్ రేట్ తో టాలీవుడ్ నిర్మాతల వరుసలో ముందుంటారు అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. దిల్ రాజు ఇన్నేళ్ళపాటు సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతూ వస్తున్నదంటే అది అతనిలోని జడ్జిమెంట్ స్కిల్స్ వల్లనే అని చెప్పాలి.

దిల్ రాజులోని ఈ టాలెంట్ ఇప్పటిది కాదు, నిర్మాత కాకముంది డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నపుడే ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పగలిగే వాడని అంటూ ఉంటారు.ఫక్తు కమర్షియల్ నిర్మాతల మాదిరి కాకుండా, మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. అప్పట్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా నుండి నిన్న వచ్చిన బలగం సినిమా వరకు చుస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

దిల్ రాజు నుండి వచ్చిన సినిమా ఇంటిల్లిపాది కుచ్చోని చూసే విధంగా ఉంటాయన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగానే కాకుండా తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేసి యావరేజ్ సినిమాను కూడా హిట్ రేంజ్ కి తీసుకెళ్లి తెలివైన నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మొన్న సంక్రాతి సినిమాల రిలీజ్ సమయంలో థియేటర్ల విషయంలో ఆధిపత్య ధోరణి చూపించి కొంత నెగిటివిటీ మూట కట్టుకున్నప్పటికీ రీసెంట్ గా బలగం సినిమాతో హిట్ కొట్టి తన సత్తా చాటుకున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు