Balagam: బలగం వివాదంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!

బలగం పబ్లిక్ స్క్రీనింగ్స్ పై నిర్మాత దిల్ రాజు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దానిపై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. బలగం పబ్లిక్ స్క్రీనింగ్స్ ను ఆపటం తమ ఉద్దేశం కాదని ఓటీటీ సంస్థ తెచ్చిన ఒత్తిడి మేరకే పోలీసులకు నోటిస్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. తమ సినిమాను జనాలు అందరూ చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అది థియేటర్, ఓటీటీ, టీవీ ఏదైనా కానీ జనాల్లోకి తమ సినిమా చేరటం ముఖ్యమని భావించిన తమకు ఇప్పుడు నాలుగో ఆప్షన్ కింద ఈ పబ్లిక్ స్క్రీనింగ్ వచ్చిందని అన్నారు.

ఒక నెలలోనే బలగం సినిమాకు 5నేషనల్ అవార్డులు రావటం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తమ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన 50 సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా ద్వారా అప్పట్లో కొన్ని కుటుంబాల్లో మార్పు వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు బలగం సినిమా చూసి కొన్నేళ్ల కిందట విడిపోయిన కుటుంబాలు కలుస్తున్నాయని, ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

అయితే నిన్న దిల్ రాజు పోలీసులకు నోటీసులు ఇచ్చారు అన్న వార్త రాగానే “ఈయనకు మరీ ఇంత డబ్బు పిచ్చా” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు తానూ ఏదో భావించి పోలీసులను ఆశ్రయిస్తే ఇంకేదో జరిగేలా ఉండటం గమనించి తేరుకొని ప్రెస్ మీట్ పెట్టాడా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి.

- Advertisement -

ఏది ఏమైనా బలగం సినిమా తెలుగు నాట ఒక ఉద్యమానికి దారి తీసిందని చెప్పాలి. సినిమాకున్న బలాన్ని మరోసారి ప్రూవ్ చేసింది బలగం. టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో జనాలు ఇలా జాతర లాంటివి జరిగిన సమయాల్లో జనాలు ఇలా పబ్లిక్ స్క్రీనింగ్ వేసుకొని సినిమాలు చూసేవాళ్లు. అలాంటిది దాదాపు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో కూడా జనాలు సామూహిక స్క్రీనింగ్ ద్వారా ఈ సినిమాను చూస్తున్నారంటే ఇంతకు మించిన అవార్డు ఇంకేదీ ఉండదేమో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు