Allu Arjun: రాజమౌళి బన్నీని అందుకే రిజెక్ట్ చేశాడా..?

దర్శక ధీరుడు రాజమౌళి RRR తర్వాత గ్లోబల్ డైరెక్టర్ గా ఎదిగాడు. స్టూడెంట్ నంబర్ వన్ తో మొదలైన జక్కన్న సినీ ప్రస్థానం అంతంతై వటుడింతై అన్న చందాన  సినిమా సినిమాకు తన గ్రాఫ్ ప్నిచుకుంటూ వచ్చాడు. రాజమౌళి కెరీర్ ని మగధీరకు ముందు, మగధీరకు తర్వాత అని చెప్పవచ్చు. అప్పట్లో మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలవటంతో దేశం మొత్తం రాజమౌళి పేరు వినిపించింది. స్టార్ హీరోలు అందరు రాజమౌళితో సినిమా చేయటం కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం టాలీవుడ్లో. అయితే, రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు. రాజమౌళి మాత్రం బన్నీతో సినిమా చేసేందుకు ఇష్టపడటం లేదట.
మగధీర సినిమా సమయంలో అల్లు అరవింద్ కి, రాజమౌళికి ఏర్పడ్డ విభేదాలే బన్నీతో సినిమా చేయకుండా ఆపుతున్నాయని టాక్ ఉంది. మగధీర సినిమా విషయంలో అనుకున్న బడ్జెట్ కంటే రాజమౌళి ఎక్కువ ఖర్చు పెట్టించాడని అప్పట్లో టాక్ నడిచింది. సినిమా హిట్ అయిన తర్వాత ఆ క్రెడిట్ రాజమౌళికి దక్కకుండా అల్లు అరవింద్ వ్యవహరించాడని, అప్పటి నుండి రాజమౌళి అల్లు అరవింద్ కి దూరంగా ఉంటున్నాడని అంటుంటారు.
RRR సినిమా తర్వాత రాజమౌళి, బన్నీ కాంబినేషన్లో సినిమా సెట్ చేయటానికి అల్లు అరవింద్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడని సమాచారం. కానీ, రాజమౌలి మాత్రం దిగి రావట్లేదని అంటున్నారు. ఆస్కార్ రేంజ్ కి ఎదిగిన రాజమౌళి ఎప్పటి నుండో అనుకుంటున్న మహాభారతం స్క్రిప్ట్  మీద దృష్టి పెడతాడని భావిస్తున్న తరుణంలో బన్నీతో సినిమా టాపిక్ మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి, సినిమా మార్కెటింగ్ లో మాస్టర్ బ్రెయిన్ అయిన అల్లు అరవింద్ ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ని ఎలా సెట్ చేస్తాడో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు