Tollywood: ‘అల్లు – మెగా’ ఫ్యామిలీల మధ్య దూరం నిజమేనా – ఫొటోతో ఫుల్ క్లారిటీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు – మెగా ఫ్యామిలీల బంధానికి ఒక ప్రత్యేకత ఉంది. అల్లు రామలింగయ్య ఇంటికి చిరంజీవి అల్లుడు అయినప్పుడు మొదలైన ఈ బాండింగ్ ఇప్పటి జెనరేషన్ వారసుల మధ్య కూడా కొనసాగుతూ ఉంది. అప్పట్లో చిరంజీవి, అల్లు అరవింద్ ల కాంబినేషన్ ని కృష్ణార్జునులతో పోల్చేవారు. ప్రజారాజ్యం సమయంలో కీలక బాధ్యతలన్నీ చిరంజీవి అల్లు అరవింద్ కి అప్పగించటం ఇందుకు నిదర్శనం. అయితే పార్టీ విషయంలో నెలకొన్న వివాదాల గురించి ప్రస్తావన అప్రస్తుతం. అప్పట్లో చిరంజీవి ఆర్థిక వ్యవహారాలు, సినిమాలకు సంబందించిన వ్యవహారాలు అన్నిటిలో అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించేవాడు.

అయితే అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదగడంతో  చిరంజీవి వ్యవహారాల్లో అల్లు అరవింద్ పాత్ర తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు ఫ్యామిలీల మధ్య దూరం ఏర్పడిందంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. ఈ వాదనలను ఇరు వర్గాలు ఖండిస్తూ వస్తున్నప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదు అన్న కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో రామ్ చరణ్ సొంత బ్యానర్ ఏర్పాటు చేయటం, హోమ్ బ్యానర్ లాంటి గీతా ఆర్ట్స్ ని పక్కన పెట్టడం ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తూ ఉన్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆ వార్తలు నిజమని నమ్మాల్సి వస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ ఇటీవల రామ్ చరణ్ బర్త్ డేకి విష్ చేయకపోవటం వారి పెరిగిన దూరానికి నిదర్శనంగా అనుకోవాల్సి వస్తుంది. తాజాగా జరిగిన ఉపాసన బేబీ షవర్ పార్టీకి సతీ సమేతంగా కాకుండా అల్లు అర్జున్ ఒక్కడే హాజరవడం ఈ అనుమానాలకు మరింత తావిస్తోంది. ఉపాసనతో దిగిన ఫొటోలో కూడా రామ్ చరణ్ లేకుండా అల్లు అర్జున్ ఒక్కడే ఉండటంతో రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరగటం నిజమే అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూనే ఉపాసన ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు మెగా ఫాన్స్ లో ఆందోళన పెంచుతున్నాయి. ఒకవేళ వస్తున్న వార్తలే గనక నిజమైతే ఇప్పటికే అల్లు, మెగా వర్గాలుగా విడిపోయిన ఫ్యాన్స్ మధ్య వైరం మరింత పెరిగి ఆ ప్రభావం సినిమాలపై పడే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు