Allu Arjun: మరోసారి బయట పడ్డ మెగా – అల్లు ఫ్యామిలీ విభేదాలు

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయా ? ఈ ప్రశ్న చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనికి సమాధానం దొరికింది అనుకున్న ప్రతి సారి, మళ్లీ ఏదో ఒక్క అంశంపై ఈ రెండు ఫ్యామిలీల పంచాయితి రచ్చకెక్కుతున్నాయి. దీనికి కారణం.. అల్లు అర్జున్ వ్యవహార శైలీ అంటూ కొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో “మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చాను” అని చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.

కానీ, ప్రస్తుతం సోలోగా ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే, స్టైలీష్ స్టార్ ట్యాగ్ ను తొలగించి, ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ ను చేర్చుకున్నాడు అంటూ కూడా టాక్ వినిపించింది. దీనిపై అల్లు ఫ్యామిలీ ఇన్ డైరెక్ట్ గా పలుసార్లు క్లారిటీ ఇచ్చినా, మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు తగ్గలేదు. ఇటీవల రామ్ చరణ్ మ్యారేజ్ డే సమయంలో సాయంత్రం వరకు అల్లు అర్జున్ నుంచి విషెస్ రాలేదు. సాయంత్రం ఏదో ఒక పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

దీనికి కూడా అల్లు ఫ్యాన్స్ వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే విషెస్ చెప్పలేదు అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజుకు అయితే, అల్లు అర్జున్ నుంచి ఎలాంటి విషెస్ రాలేదు. సాయంత్రం రామ్ చరణ్ ఇచ్చిన పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించలేదు. దీంతో మరోసారి అల్లు – మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఈ రెండు ఫ్యామిలీ మధ్య విభేదాలపై కూడా తెగ చర్చ జరుగుతుంది.

- Advertisement -

నిజానికి రామ్ చరణ్ కు ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇప్పటి వరకు రామ్ చరణ్ తన పుట్టిన రోజును మెగా పవర్ స్టార్ ట్యాగ్ చేసుకున్నాడు. కానీ, ప్రస్తుతం చరణ్ కు గ్లోబల్ స్టార్ గుర్తింపు వచ్చింది. దీంతో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ నుంచి విషెస్ రాకపోవడం.. “రామ్ చరణ్ కు వస్తున్న గుర్తింపును చూసి అల్లు ఫ్యామిలీ తట్టుకోవడం లేదని, అందుకే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది” అంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరిస్తుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు