Yatra2: యూవీ – ప్రభాస్ మధ్య రాజకీయ చిచ్చు రేగిందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తోటి హీరోలందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తన స్నేహితుల సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ ఇంపార్టెన్స్ ఇస్తూ, బాహుబలి తర్వాత వచ్చిన ప్రతి సినిమాకు అటు డిస్ట్రిబ్యూషన్ పరంగానో, నిర్మాణ పరంగానో ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా యువీ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంటుందని మొదటి నుండి టాక్ ఉండేది. అయితే, చివరి నిమిషంలో యువీ సంస్థ తప్పుకోవడంతో పీపుల్స్ మీడియా సీన్ లోకి ఎంటరైంది. ప్రభాస్ కి, యువీ ప్రొడక్షన్స్ కి మధ్య తలెత్తిన రాజకీయ విభేదాలే ఇందుకు కారణం అని టాక్ వినిపిస్తోంది.

ఆదిపురుష్ సినిమా డిస్ట్రిబ్యూషన్ నుండి తప్పుకున్న వెంటనే ‘యాత్ర2’ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. యూవీ సంస్థ అధినేతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి కుల సమీకరణాల దృష్ట్యా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న యాత్ర2 సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడని తెలుస్తోంది. ప్రభాస్ వ్యక్తిగతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఫ్యామిలీ మాత్రం బీజేపీ పక్షం అని అందరికీ తెలిసిన విషయమే.

ఈ నేపథ్యంలో పొలిటికల్ డిఫరెన్సెస్ వల్లనే ప్రభాస్, విక్రమ్ రెడ్డిలకు మధ్య దూరం పెరిగిందని, అందుకే అతను రామ్ చరణ్ తో కలిసి వి – మెగా పిక్చర్స్ బ్యానర్ అని స్థాపించాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా యువీ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ పొలిటికల్ క్యాంపైన్ కోసం తీస్తున్న యాత్ర2 సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం అన్నది ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే అని చెప్పాలి. మరి, ప్రభాస్ కి విక్రమ్ రెడ్డికి మధ్య విబేధాలున్నాయని వస్తున్న వార్తలు నిజమో కాదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు