Manchu Manoj: ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

ఇటీవల ఒక పర్సనల్ వీడియో వల్ల అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో మంచు మనోజ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వల్ల మంచు కుటుంబంలో ఉన్న వివాదాలు బయటపడి నవ్వులపాలైన పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా, తాజాగా మంచు మనోజ్ మౌనిక దంపతులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూకి సంబందించిన ప్రోమో విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్ యాంకర్ గా వ్యవహరించిన ఆ షో త్వరలోనే విడుదల కానుంది. పెళ్ళైన తర్వాత మొదటిసారి సతీసమేతంగా టీవీషోలో కనిపించిన మంచు మనోజ్ తమ ప్రేమ వ్యవహారంతో పాటు మరికొన్ని ఆసక్తికర అంశాలు ఇందులో వెల్లడించారు.

వెన్నెల కిశోర్, మంచు మనోజ్ వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ అవ్వటం వల్ల ఈ షో ఎంటర్టైనింగ్ ఉండనున్నట్టు ప్రోమో చూస్తే అనిపిస్తుంది. తమ ప్రేమ వ్యవహారం గురించి వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన మనోజ్ దంపతులు తమ ప్రేమకు ఎన్నో అడ్డంకులు వచ్చాయని వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డామని చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో ప్రేమ కావాలా, సినిమాలు కావాలా అన్న పరిస్థితి ఎదురైందని, అలాంటి సమయంలో తనకోసం బిడ్డతో నిలబడ్డ అమ్మాయి కోసం తాను నిలబడకపోతే బతికుండి కూడా వేస్ట్ అని అనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్.

గత కొద్ది కాలంగా మొదటి భార్యతో విడాకులు, మౌనిక ప్రేమ వ్యవహారం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఎట్టకేలకు మౌనికను పెళ్లాడిన మనోజ్ త్వరలోనే వరుస సినిమాలతో బిజీ అవనున్నానని ఇటీవలే మీడియాకు వెల్లడించాడు. ఈ నవదంపతుల ప్రేమ కబుర్లతో హృద్యంగా, ఎమోషనల్ గా సాగిన ఈ ప్రోమో అక్కడక్కడా మనోజ్ వెన్నెల కిషోర్ ల కామెడీ టైమింగ్ తో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. త్వరలోనే టెలికాస్ట్ కానున్న ఈ షో ద్వారా ఇంకెన్ని ఆసక్తికర అంశాలు తెలుస్తాయో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు