Chiranjeevi: ఆ ఇద్దరు హీరోయిన్లతో మెగాస్టార్ లవ్ ట్రాక్ ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక గాసిప్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. హీరో, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే కనిపించే ప్రతి నటీనటులను వదలకుండా నెటిజెన్లు ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ వైరల్ గా మార్చేస్తుంటారు. గాసిప్స్ పుణ్యమా అని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న వార్తల్లో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియని విధంగా పరిస్థితి మారిపోయింది. అలా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్ లకు కొన్నిసార్లు మెగాస్టార్ చిరంజీవి కూడా బలైపోయారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, మెగాస్టార్ గా మారిపోయారు చిరంజీవి. రెండు దశాబ్దాల పాటు చిరంజీవి ఇండస్ట్రీలో వెలిగిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన పక్కన ఎక్కువగా నటించిన హీరోయిన్లు మాధవి, రాధా. అయితే వీరిద్దరితో చిరుకు ప్రేమాయణం సాగుతుందని, కలిసి ఉన్నారని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. ఏకంగా దశాబ్దం పాటు ఈ గాసిప్స్ హోరెత్తించాయి. అయితే చిరంజీవి మృదుస్వభావి కావడంతో వాటిని లైట్ తీసుకునేవారు.

కానీ ఇండస్ట్రీ పెద్దలు కూడా చిరు విషయాలపై కొన్ని పత్రికలకు లీకులు ఇచ్చేవారని టాక్ ఉండేది. ఒకానొక దశలో చిరు కుటుంబంలోనూ ఈ గాసిప్స్ మంటలు రేపాయట. చిరు భార్య సురేఖ ఈ వార్తలను చూసి బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కోసం గతంలో విజయశాంతి, రాధా గొడవలు పెట్టుకున్నారు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

- Advertisement -

దీంతో ఈ వివాదాల నుండి బయటపడేందుకు చిరంజీవి కుటుంబం మొత్తాన్ని కూడా షూటింగ్ స్పాట్లకు తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయట. ఈ విషయాలను ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న విజయ బాపినీడు చెప్పేవారు. ఆ తర్వాత ఈ రూమర్లపై అల్లు రామలింగయ్య జోక్యం చేసుకొని వీటిని నమ్మకూడదని వారించే వారట. అందుకే ఇండస్ట్రీలో వచ్చే గాసిప్స్ ను చిరంజీవి అస్సలు పట్టించుకోరట.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు