Nani: అరుదైన ఫీట్ అందుకున్న నాని.. గ్రేట్ కదా..!

నాచురల్ స్టార్ నాని సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా చలామణి అవుతూ మరింత బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాస్ లుక్ లో అందరిని ఆకట్టుకున్న ఈయన తాజాగా హాయ్ నాన్న అంటూ క్లాసిక్ లుక్ లో ఆకట్టుకున్నారు. జెర్సీ సినిమా తర్వాత మరొకసారి ఎమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్టుతో వచ్చిన నాని ఈ సినిమాలో తండ్రి కూతుళ్ళ నేపథ్యంలో వచ్చి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇకపోతే ఇందులో కొన్ని సన్నివేశాలు హృదయాలను తాకుతాయని నెటిజెన్స్ చెబుతున్నారు. ఇకపోతే హాయ్ నాన్న అనే చిత్రం నాని కెరియర్ లో ఒక చెరిగిపోని ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుందని.. అంతేకాదు ఈ సినిమా నాని కెరియర్ లో అరుదైన ఫీట్ అందుకునేలా చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకెళితే డిసెంబర్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా అమెరికాలో కూడా అదరగొడుతూ నాని కెరియర్ లోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. నానికి ఇప్పటివరకు 8 సినిమాలు వన్ మిలియన్ డాలర్ సాధించిన సినిమాలుగా ఆయన రికార్డ్ లో ఉన్నాయి.. ఇప్పుడు హాయ్ నాన్నతో తొమ్మిది సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ సాధించినట్లు తెలుస్తోంది.

నాని కంటే ముందే సూపర్ స్టార్ మహేష్ బాబుకు వన్ మిలియన్ డాలర్లు సంపాదించిన సినిమాలు 11 ఉండగా.. ఇప్పుడు నాని ఆ అరుదైన రికార్డును అందుకొని తొమ్మిది సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక వీరి తర్వాతి స్థానాలలో పవన్ కళ్యాణ్ ఏడు సినిమాలు, ఎన్టీఆర్ ఏడు సినిమాలు, ప్రభాస్ 5 సినిమాలు , అల్లు అర్జున్ 5 సినిమాలు , చిరంజీవి 4 సినిమాలు, బాలకృష్ణ నాలుగు సినిమాలు, వరుణ్ తేజ్ 4 సినిమాలు, విజయ్ దేవరకొండ నాలుగు సినిమాలను తమ ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇకపోతే హాయ్ నాన్న సినిమా మూడవరోజు రూ .3.80 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ .14.75 కోట్ల షేర్, రూ.27.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు