Project K: మైథలాజికల్ టచ్ తో ప్రాజెక్ట్ కె – ఆదిపురుష్ ఎఫెక్ట్ నుండి బయటపడుతుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి తరచూ ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అమితాబ్, కమల్, దీపికా వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సైఫై జానర్లో సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ విష్ణువు అవతారంలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న ఈ అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతుండగా ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా రిజల్ట్ కొన్ని అనుమానాలకు దారి తీస్తోంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ ని వాల్మీకి రామాయణం రూపంలో కాకుండా కొత్తగా చూపించాలని ప్రయత్నించిన ఓం రౌత్ అండ్ టీమ్ సినిమాటిక్ లిబర్టీతో చేసిన కొన్ని పొరపాట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు [ప్రాజెక్ట్ కె కూడా మైథలాజికల్ టచ్ తో రూపొందుతుంది అన్న వార్తలొస్తున్న నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఓం రౌత్ చేసిన పొరపాట్లు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అన్న ఆసక్తిని రేపుతున్నాయి.

ప్రాజెక్ట్ కె సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ అయిన పోస్టర్స్ అన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంకేతంగా ఉన్న నేపథ్యంలో మైథలాజికల్ టచ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న ఆసక్తిని పెంచుతున్నాయి. పైగా సూపర్ న్యాచురల్ పవర్స్ నేపథ్యంలో మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటం ప్రధానంగా సాగే ఈ సినిమాలో సైఫై, సోషియో ఫాంటసీ, మైథాలజీ వంటి అంశాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు