Rajamouli : రాజమౌళి ఆసక్తికర ట్వీట్ – శ్రీకాంత్ కు ఎనలేని బూస్టప్..!

నాని, కీర్తి సురేష్ జంటగా డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన చిత్రం దసరా సృష్టిస్తున్న సంచలనాల గురించి వింటూనే ఉన్నాం. డెబ్యూ డైరెక్టర్ పై నమ్మకం ఉంచి తన కెరీర్ హయ్యెస్ట్ బడ్జెట్తో పాన్ ఇండియా వైడ్ సినిమాను రిలీజ్ చేసినందుకు నాని గట్స్ ని అందరూ మెచ్చుకుంటుంటే, తొలి చిత్రం అయినప్పటికీ ఏ మాత్రం తడబడకుండా సినిమా తీసి కమర్షియల్ హిట్ అందుకున్నందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ప్రశంసలు  అందుతున్నాయి. హీరోయిన్ కీర్తి సురేష్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. పర్ఫామెన్స్ విషయంలోనే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా నానికి ఇది కెరీర్ బెస్ట్ మూవీ.

తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్ర యూనిట్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా ఎలుగెత్తి చాటి ఆస్కార్ సాధించిన దర్శకుడు అయ్యుండి కూడా ఒక యువ దర్శకుడు అందులోను డెబ్యూ డైరెక్టర్ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చెయ్యటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఇండస్ట్రీలో మంచి పరిణామం అని, రాజమౌళి లాంటి దర్శకుడి నుండి ఇలాంటి ప్రోత్సాహం అప్కమింగ్ డైరెక్టర్స్ కి ఎంతగానో అవసరం అని అభిప్రాయపడుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

- Advertisement -

దసరా యూనిట్ ని అభినందిస్తూ చేసిన ట్వీట్ లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో పాటు హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్, సినిమాటోగ్రఫీతో పాటు సినిమాలో నటించిన అందరిని ప్రశంసించారు. రాజమౌళి ట్వీట్ చూసి ఆనందించిన శ్రీకాంత్ ఓదెల అయన ట్వీట్ కు స్పందిస్తూ, “ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్నా” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

https://twitter.com/odela_srikanth/status/1642827474064257025?s=20

ఇదిలా ఉండగా, శ్రీకాంత్ గురువు సుకుమార్ పుష్ప2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల స్పందించకపోతే, శిష్యుడి సక్సెస్ చూసి ఓర్వలేకున్నాడు కాబట్టే సుకుమార్ ఈ సినిమాను మెచ్చుకుంటూ కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయలేదంటూ కొంత మంది నెట్టింట హడావిడి చేశారు. గతంలో సుకుమార్ ఏ సినిమాకు కూడా అభినందిస్తూ ట్వీట్ వేయలేదని, అసలు సుకుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న దాఖలాలు లేవని సదరు నెటిజెన్స్ గమనిస్తే మంచిది. ఏది ఏమైనా రాజమౌళి లాంటి గ్లోబల్ డైరెక్టర్ ఒక డెబ్యూ డైరెక్టర్ ని అభినందించటం టాలీవుడ్ కి మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు