SSMB29: రాజమౌళి సినిమాలో జాన్వీ కపూర్.. సైన్ కూడా చేసేసిందా ?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NTR30 పూజా కార్యక్రమం ఎట్టకేలకు జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, ప్రశాంత్ నీల్ మొదటి షాట్ కు దర్శకత్వం వహించాడు. గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకున్న తారక్ కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆచార్యతో కోలుకోలేని విధంగా మారిపోయిన డైరెక్టర్ కొరటాల శివకు కూడా ఈ మూవీ చాలా ముఖ్యం. పైగా కొరటాల శివకు ఇది మొదటి పాన్ ఇండియా మూవీ.

ఇదిలా ఉండగా, పూజా కార్యక్రమంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు ప్రముఖులు కనిపించారు. NTR30 హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా మెరిసింది. అయితే ఈ పూజా కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళి.. జాన్వీ కపూర్ నుంచి సైన్ తీసుకున్నాడు.

ఇది ప్రస్తుతం సర్వత్ర చర్చనీయాశంగా మారింది. అలాగే దీనిపై అనేక రకాలుగా వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. రాజమౌళి తర్వాత సినిమాలో జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారని, అందుకే రాజమౌళి అందరి ముందు అగ్రిమెంట్ పై సైన్ చేయించుకున్నాడని కొంత మంది అంటున్నారు. కాగా రాజమౌళి తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో అధికారిక ప్రకటన కూడా చేసేశారు. త్రివిక్రమ్-మహేష్ సినిమా ముగిసిన తర్వాత ఇది పట్టాలెక్కనుంది.

- Advertisement -

SSMB29 మూవీలో మహేష్ బాబు సరసన నటించేందుకు జాన్వీ కపూర్ ను జక్కన్న ఒప్పించాడని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం కూడా చేయించుకున్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. జాన్వీ కపూర్ చేత రాజమౌళి సైన్ తీసుకున్నది మూవీ కోసం కాదట. రాజమౌళి కూతురు మయూక.. జాన్వీ కపూర్ కు వీరాభిమాని. జాన్వీ ని కలవాలని చాలా ట్రై చేసిందట. కానీ, అది వర్కౌంట్ కాలేదట. ఇప్పుడు NTR30 ఈవెంట్ లో తన కూతురు మయూక కోసం జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ ను రాజమౌళి తీసుకున్నాడట. అంతే గానీ, SSMB29 కోసం కాదు.

కాగా SSMB29 లో మహేష్ కు జోడీగా బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణె ను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో జక్కన్న ఉన్నాడట. అయితే దీనిపై త్వరలోనే ప్రకటన రావొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు