Thalapathy 67 : స్టార్ కాస్ట్‌తో..

తమిళ తలపతి విజయ్ నుంచి వచ్చే సినిమాలపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అనౌన్స్ చేసిన నాటి నుంచే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అలా భారీ బజ్ తో వచ్చిన వారిసు మిశ్రమ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ సినిమా 150 కోట్ల మార్క్ ను అందుకుని, బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతుంది. ఇదిలా ఉండగా తలపతి తర్వాత సినిమాపై కూడా సౌత్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే.. తలపతి67ని విజయ్ కి మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ మాస్టర్ తో పాటు కార్తికి ఖైదీ, కమల్ హాసన్ కు విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించాడు. దీంతో తలపతి 67పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. కాగా ఈ సినిమాలో క్యారెక్టర్ల గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. సినిమాలో లోకేష్ కనగరాజ్ మొత్తం స్టార్ నటీనటులను ఎంపిక చేస్తున్నాడని తెలుస్తోంది.

విజయ్‌కి జోడీగా త్రిషను ఎంపిక చేశారని, అలాగే రెండో హీరోయిన్ గా ప్రియా ఆనంద్ ను ఫిక్స్ చేశారనే వార్తలు ఇటీవల వచ్చాయి. అలాగే హీరో సూర్య, సంజయ్ దత్, అర్జున్, నివిన్ పౌలీ, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ లాంటి అగ్ర స్థాయి నటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా మరో స్టార్ హీరో ఈ సినిమాలో భాగం కాబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అతనేవరంటే.. చార్లీ 777 సినిమాతో సూపర్ హిట్ కొట్టి, కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ సినిమాపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రక్షిత్ శెట్టిని లోకేష్ కనగరాజ్ ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. అయితే దీనిపై తలపతి 67 మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా.. విజయ్ తలపతి సినిమాలో రక్షిత్ శెట్టి నటిస్తే.. సినిమా హై రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఎలాగైనా, విజయ్ సినిమాలో రక్షిత్ శెట్టిని తీసుకోవాలని లోకేష్ కనగరాజ్ ను ఫ్యాన్స్ కోరుతున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు