అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ‘ఏజెంట్’. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అఖిల్ బ్లాక్ బస్టర్ కొడితే చూడాలని ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగానో శ్రమించి రెండేళ్లకు పైగా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసి పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారైంది. ఈ క్రమంలో ఏజెంట్ సినిమా విషయంలో వినిపిస్తున్న మరో వార్త అక్కినేని అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఏజెంట్ కథ మొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గరికి వెళ్లిందని అయితే, అప్పట్లో ఉన్న కమిట్ మెంట్స్ వల్ల కార్యరూపం దాల్చలేదని సమాచారం. ఆ మధ్య రామ్ చరణ్ కూడా ‘రా ఏజెంట్’ క్యారెక్టర్లో నటిస్తానని ఓ సందర్భంలో మీడియాతో కూడా వెల్లడించాడు. అప్పటి కమిట్ మెంట్స్ వల్ల ‘ఏజెంట్’ కథని పక్కనపెట్టిన రామ్ చరణ్ చాలా కాలం తర్వాత అఖిల్ కి సజెస్ట్ చేశాడని అంటున్నారు. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ సమయంలో అఖిల్ కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు.దీంతో రామ్ చరణ్ తమ హీరోకి డిజాస్టర్ ఇచ్చాడంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
మరో పక్క ఏజెంట్ డిజాస్టర్ కి కారణం సురేందర్ రెడ్డి టేకింగ్ లో లోపాలే అంటూ టాక్ బలంగా వినిపిస్తోంది. రామ్ చరణ్ గనక ఈ కథని అఖిల్ కి సజెస్ట్ చేయకపోయి ఉంటే, తమ హీరోకి డిజాస్టర్ వచ్చి పాడేది కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆ రకంగా రామ్ చరణ్ డిజాస్టర్ నుండి తప్పుకుంటే బ్లాక్ బస్టర్ కోసం ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న అఖిల్ కి ఏజెంట్ రూపంలో మరో డిజాస్టర్ వచ్చి పడిందన్నమాట.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News