Bhola Shankar: రీమేక్ కి అంత రేటా – టూ మచ్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తమిళ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా నటించింది. రీమేక్ కావటంతో ఈ సినిమాకు మొదటి నుండి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదనే చెప్పాలి. అయితే, నిర్మాత అనిల్ సుంకర మాత్రం భోళా శంకర్ నైజాం రైట్స్ కోసం 32కోట్ల భారీ అమౌంట్ ని కోట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఒక్క మెగాస్టార్ సినిమా అన్న అంశం మినహా ఏ ఇతర పాజిటివ్ అంశం లేని ఈ రీమేక్ సినిమాకి అంత రేట్ కోట చేయటం టూమచ్ అన్నది బయ్యర్ల వాదనగా తెలుస్తోంది.

ఇటీవల ఏజెంట్ సినిమా ద్వారా తీవ్రంగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకర భోళాకి ఆ రేంజ్ లో డిమాండ్ చేయటం వెనక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. చిరంజీవి గత చిత్రం వాల్తేరు వీరయ్య నైజాంలో 32కోట్లు వసూలు చేసింది కాబట్టి ఈ సినిమాకు కూడా అదే రేట్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే, ఏజెంట్ ద్వారా నష్టపోయిన బయ్యర్లు ఇప్పుడు భోళాశంకర్ లాంటి రీమేక్ కోసం ఒక్క నైజాం ఏరియాకి అంత పెద్ద మొత్తం పెట్టి కొనటానికి ముందుకొస్తారు అన్నది ప్రశ్నగా మారింది.

ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ కారణంగా తన ఆలోచనా తీరు మార్చిన చిరు భోళాశంకర్ లో కీలక మార్పులు కీలక మార్పులు చేశాడన్న వార్తలొస్తున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి, వాల్తేరు వీరయ్య సినిమాలో అక్కడక్కడా వింటేజ్ స్టైల్ లో మెరిసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి భోళాశంకర్ ద్వారా మరో హిట్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు