Power Star: పవన్ సుధీర్ వర్మకు ఛాన్స్ ఇవ్వడానికి కారణం..?

పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు అన్ని అయిపోయాక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం అయిపోతాడని అనుకున్నారు అందరూ. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో ఓ సినిమా చేయనున్నాడని. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలే పూర్తి కాకముందే ఇంకో సినిమా ఉందంటూ న్యూస్ రావటం ఒక షాకింగ్ విషయం అయితే, వరుస ఫ్లాప్స్ లో సుధీర్ వర్మ లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వటం ఇంకొక షాకింగ్ న్యూస్.

ఈ కాంబినేషన్ పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తారని, డైరెక్షన్ మాత్రం సుధీర్ వర్మ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. సుధీర్ వర్మకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు కాబట్టే మాటల మాంత్రికుడు ఈ రకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఒకవైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాలు అంటూ ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన సినిమాల వ్యవహారాలన్నీ త్రివిక్రమ్ కి అప్పగించారట, ఇదే ఇప్పుడు సుధీర్ వర్మ, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ కుదరటానికి కారణం అని కూడా టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక యంగ్ హీరోకు క్యారెక్టర్ ఉండబోతుందని ఆ క్యారెక్టర్ వైష్ణవ్ తేజ్ చేయనున్నాడని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేంత వరకు వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు