Power Star: పవన్ కళ్యాణ్ లో అప్పటి డెడికేషన్ ఏమైంది..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే యువతలో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది, అప్పట్లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ప్రతిదీ ఒక్కో ట్రెండ్ క్రియేట్ చేసేది అంటే అతిశయోక్తి కాదు. తన సినిమాల్లోని కాస్ట్యూమ్స్, మ్యూజిక్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. జానీ సినిమా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఆ సినిమాకు తానే స్వయంగా డైరెక్ట్ చేసేంత డెడికేషన్ ఉండేది అప్పట్లో పవన్ కళ్యాణ్ కు సినిమాలంటే. అయితే పవన్ కళ్యాణ్ కు రాను రాను సినిమాల పట్ల ఆసక్తి తగ్గుతూ వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చాక పలు వేదికల్లో స్వయంగా ఆయనే ఈ అంశాన్ని వెల్లడించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలకు గాను 20 నుండి 30కాల్షీట్స్ కి మించి కేటాయించలేకపోవటం కూడా ఇందుకు ఉదాహరణగా కూడా చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కువగా రీమేక్ సినిమాలపైనే ఆధార పడటం కూడా ఈ ప్రశ్నకు తావిస్తోంది. ఆ మధ్య వచ్చిన కాటమరాయుడు మొదలుకొని వకీల్ సాబ్, భీమ్లా నాయక్, నెక్స్ట్ రాబోయే వినోదాయ సీతం కూడా రీమేక్ సినిమానే, ఈ సినిమాకు 20రోజుల కాల్షీట్స్ కేటాయించిన పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో రాబోతున్న ఓజీ సినిమాకు కూడా 30కాల్షీట్లే కేటాయించారట. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నారన్నది నిజమే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు వల్ల కొంత మంది ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

బాడీ లాంగ్వేజ్ కానీ, అపియరెన్స్ లో కానీ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుక్నన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అలరించకపోవటం గమనార్హం. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్, ఇక ముందు రాబోయే సినిమాల్లో డెడికేషన్ తో తీసి అలరిస్తారో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు