BRO: స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ – గురూజీ ప్లానింగ్ మాములుగా లేదు..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శత్వంలో తమిళ సినిమా వినోదాయ సీతాం రీమేక్ గా వస్తున్న బ్రో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న పోస్టర్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, నార్మల్ ఆడియెన్స్ లో సినిమాపై ఆసక్తి పెంచుతోంది. మోషన్ పోస్టర్ కి థమన్ అందించిన సంగీతం పవన్ కళ్యాణ్ లుక్స్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉంది. ఈ సినిమా కోసం అన్నపూర్ణ 7ఎకర్స్ లో భారీ స్థాయిలో పబ్ సెట్ వేశారని, ఆ సెట్లో ఒక సాంగ్, ఒక ఫైట్ షూట్ చేయనున్నారని సమాచారం. సెట్ ఇప్పటికే పూర్తి కాగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. గతంలో చాలా సినిమాల్లో పబ్ సెట్ వేసినప్పటికీ, ఇంత భారీ రేంజ్ లో పబ్ సెట్ వేయటం ఇదే మొదటిసారి అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా బ్రో సినిమా విషయంలో మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఇప్పటికే సిద్దమైన భారీ పబ్ సెట్ లో స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కోసం శృతి హాసన్, దిశా పటానిల పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ అప్డేట్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచుతోంది. అయితే, వినోదాయ సీతాం లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కి స్కోప్ లేని సినిమాలో ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ వంటివి పెడితే కథలో సోల్ మిస్ అవుతుందని కొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జులై 28న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత తేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన సినిమా కావటంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా నార్మల్ ఆడియెన్స్ లో కూడా ఆసక్తి పెంచుతోంది. గోపాల గోపాల తర్వాత పవన్ కళ్యాణ్ మాడరన్ దేవుడి గెటప్ లో కనిపిస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు