Tamannah:పెళ్లి రూమర్స్ పై స్పందించిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి  ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో ఆమె రిలేషన్షిప్ లో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా వీరు గోవాలో జరిగిన పార్టీలో ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా విజయ్ ని ముద్దు పేరుతో పిలుస్తూ తమన్నా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించింది.

“మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాము. అంతమాత్రానికి మా మధ్య ఏదో ఉందని పుకార్లు సృష్టించారు. దీని గురించి అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుమించి నేనేమీ చెప్పను. ఇలాంటి అనవసర విషయాల గురించి అసలు పట్టించుకోను. ఇండస్ట్రీలో హీరోల చుట్టూ నడిచే గాసిప్స్ తో పోలిస్తే  హీరోయిన్ల రిలేషన్షిప్, పెళ్లిళ్లపైనే వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాదు. మాకు నిజమైన పెళ్లి కావడానికి ముందే ఎన్నోసార్లు పెళ్లి చేసేస్తుంటారు. ప్రతి శుక్రవారం మాకు ఒక పెళ్లి జరుగుతుంది. అవన్నీ చదువుతుంటే ఒక్కోసారి నాకు కూడా పెళ్లయిపోయిందేమో అని అనుమానం కలుగుతుంది. నాకు నిజంగా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. అప్పటివరకు ప్రజలు ఇదే ఉత్సాహంతో ఉండగలరా? అప్పటికి మరో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారేమో? ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్నా కూడా అది పుకారే అని నమ్మరేమో ” అంటూ తమన్న వ్యంగ్యంగా స్పందించింది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు