Rama Banam: గోపీచంద్ ని ఇబ్బంది పెట్టిన తేజ..!

ఈ మధ్య సినిమా ప్రమోషన్లో భాగంగా సీలెబ్రిటీల చేత సినిమా యూనిట్ కానీ, హీరోని కానీ ఇంటర్వ్యూ చేయించే ట్రెండ్ ఎక్కువయ్యింది. సెలెబ్రిటీ యాంకర్ గా మారి ఇంటర్వ్యూ చేసారు అంటే అందరిలో ఆసక్తి నెలకొనటం కామన్, అందుకే ఇలాంటి ఇంటర్వ్యూలు సినిమా ప్రమోషన్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో రామబాణం సినిమా కోసం హీరో గోపీచంద్ ని డైరెక్టర్ తేజ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూకి సంబందించిన ప్రోమో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో తేజ గోపీచంద్ ని కొన్ని వివాదాస్పద ప్రశ్నలు అడగటంతో ఈ ఇంటర్వ్యూపై ఆసక్తి నెలకొంది.

గతంలో తేజ డైరెక్షన్లో గోపీచంద్ ఒక సినిమా చేద్దామని కమిట్ అయ్యి తర్వాత తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉన్న విషయంపై తేజ గోపీచంద్ ని ప్రశ్నించారు. అంతే కాకుండా, మీ తండ్రి గొప్పోడు సరే, నువ్వేం పీకావ్? అంటూ తేజ ఘాటుగా తనదైన స్టైల్ లో ప్రశ్నించటం ప్రోమోకే హైలైట్ గా నిలిచింది.

ఈ క్రమంలో ప్రోమో పట్ల గోపీచంద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన ఇమేజ్ కి నష్టం చేకూరే విదంగా ప్రోమో కట్ చేసారంటూ గోపీచంద్ సినిమా యూనిట్ పై ఫైర్ అయ్యాడట. దీంతో సినిమా యూనిట్ ఆ ఇంటర్వ్యూని రిలీజ్ చేయాలా వద్దా అన్న అయోమయంలో పడ్డారట. గోపీచంద్ కి డామేజ్ జరగకాకుండా ఉండే విధంగా ఆ ఇంటర్వ్యూ ని ఎడిట్ చేయిస్తున్నారని సమాచారం. మొత్తానికి ఎదో తలచి తేజతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే ఇంకేదో అయినట్టు అయ్యింది గోపీచంద్ పరిస్థితి. ఇంతకీ ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తారా లేదా, తేజ అడిగిన వివాదాస్పద ప్రశ్నలకు గోపీచంద్ ఎలాంటి సమాధానం ఇచ్చారు అన్నది తెలియాలంటే వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు