Samantha: అందుకే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారా..? చై ఆన్సర్ ఇదే..!

వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “కస్టడీ”. ఈ మూవీలో చైతుకి జంటగా కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ సినిమా మే 12న (నేడు) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య తన విడాకుల విషయం గురించి మొదటిసారి పూర్తిగా ఓపెన్ అయ్యి కామెంట్స్ చేశారు. వీరిద్దరూ విడిపోయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. వీరికి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

అయితే తాజాగా మరోసారి పెళ్లి, విడాకుల గురించి ఓపెన్ అయ్యారు చైతు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మజిలీ సినిమా తర్వాత సమంత నటించిన సినిమాలలో మీకు ఏదంటే ఇష్టం అని ప్రశ్నించగా.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అంటే బాగా ఇష్టమని, ఆ తరువాత ఓ బేబీ సినిమా అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాగే ఇప్పటికీ తన ప్రతి సినిమా చూస్తానని కూడా తెలిపాడు చైతు.

అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ సిరీసే అంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సమంతది చాలా కష్టపడే మనస్తత్వమని, ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని ప్రశంసలు కురిపించాడు. అయితే నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ తో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వల్లే వారు విడిపోయారు అన్నది కేవలం పుకారు మాత్రమేనని తేలిపోయింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు